NTV Telugu Site icon

Naga Babu: నీది నోరా మున్సిపాలిటీ కుప్పతొట్టా ? రోజా పై నాగబాబు ఫైర్..

Nagababu, Roja

Nagababu, Roja

Nagababu fire on Minister Roja: మంత్రి రోజాపై మెగా బ్రదర్‌ నాగబాబు ఫైర్‌ అయ్యారు. మెగా బ్రదర్స్‌ పైన రోజా చేసిన వ్యాఖ్యలకు రియాక్ట్‌ అయ్యారు నాగబాబు. పర్యాటక శాఖ మంత్రి అంటే పర్యటించటం కాదని.. పర్యాటక శాఖను డెవలప్‌ చేయటమని చెప్పుకొచ్చారు. దేశంలో ఏపీ పర్యాటక శాఖ18వ స్థానంలో ఉందని గుర్తుచేశారు. పాలన ఏం మాట్లాడినా స్పందించలేదని దానికి ఒకటే ఒక కారణమని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకోవాలని నాగబాబు సూచించారు.

పవన్‌ కల్యాణ్ ను విమర్శించే క్రమంలో మంత్రి రోజా మెగా బ్రదర్స్‌ ను ఉద్దేశించి సీరియస్‌ కామెంట్స్‌ చేసారు. దీనిపైన మోగా బ్రదర్స్‌ నాగబాబు ఒక వీడియో పోస్టు చేసారు. అందులో ఏపీలో టూరిజం శాఖ మంత్రి రోజాకు కొన్ని సూచనలు చేశారు. దేశంలో పర్యాటక రంగంలో ఏపీ 18వ స్థానంలో ఉందని కేరళ, అస్సాం, గుజరాత్‌ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయని వివరించారు. ఇక ఏపీ తరువాత స్థానాల్లో చత్తీస్‌ ఘడ్‌, జార్ఖండ్‌ ఉన్నాయని తెలిపారు. ఏపీలో పర్యాటక శాఖ పైన ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి వేల మంది జీవిస్తున్నారని వివరించారు. ఇక.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక వారి జీవితాలు మట్టొ కొట్టుకు పోయాయయని నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read also: BJP Meeting: నేడు బీజేపీ బూత్ కమిటీ సమ్మేళనం.. వర్చువల్​గా మాట్లాడనున్న జేపీ నడ్డా, బండి సంజయ్

అన్నయ్య చిరంజీవి ఇప్పటి వరకు తమ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ గురించి ఏం మాట్లాడినా స్పందించలేదన్నారు. నాగురించి మాట్లాడినా నేను పట్టించుకోలేదని చెప్పారు. ఇక మంత్రి రోజా తమ గురించి ఏం మాట్లాడినా పట్టించుకోకపోవటానికి కారణం ఒక్కటే.. రోజా నోటికి మున్సిపాల్టీ కుప్పతొట్టికి పెద్ద తేడా లేదన్నారు చూస్తా చూస్తా ఎవరూ కుప్పతొట్టిని గెలకరు అందుకే ఇప్పటి వరకు రోజా ఏం మాట్లాడినా నేను పట్టించుకోలేదన్నారు నాగబాబు.. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని పర్యాటక శాఖను ఎలా అభివృద్ధి చేయాలో తెలుసుకోవాలంటూ మంత్రి రోజాపై నాగబాబు ఫైర్‌ అయ్యారు.

మంత్రి రోజా తాజాగా చిరంజీవి గురించి చేసిన వ్యాఖ్యల పైన సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మోగా బ్రదర్స్‌ ను సొంత జిల్లాలోనే ప్రజలు ఓడించారంటే వారికి రాజకీయ భవిష్యత్తు లేదనే విషయం అర్థమవుతోందని రోజా ఆరోపించిన విషయం తెలిసిందే.. అయితే సాధారణంగా సినీ నటులు సెన్సిటివ్‌ గా ఉంటారని, అందరికి సాయం చేస్థారని కానీ.. వీళ్లు మాత్రం అందుకు భిన్నమని రోజా విమర్శించింది. అందుకే రాజకీయాల్లో వీరిని ప్రజలు ఆదరించలేదని ఎద్దేవా చేశారు. పవన్‌, నాగబాబును జనసేన నేతలుగా మంత్రి రోజా టార్గెట్‌ చేసినా, చిరంజీవి ప్రస్తావన తేవడంతో చర్చ సాగుతోంది. ఒక తాజాగా బబర్ధస్త్‌ ఫేం గెటప్‌ శ్రీను కూత తన ఫేస్‌ బుక్‌ ద్వారా చిరంజీవి గురించి మంత్రి రోజా చేసి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన తీరు సంచలనంగా మారింది.

Show comments