Site icon NTV Telugu

Naga Vamsi : నాగ వంశీ కూడా మాస్ జాతర అప్డేట్ ఇవ్వలేదేంటి?

Nagavamsi

Nagavamsi

మీడియాలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ప్రొడ్యూసర్స్‌లో నాగ వంశీ ఒకరు. ఈ మధ్యకాలంలో వార్ 2 తెలుగు హక్కులు దక్కించుకున్న ఆయన, అనూహ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఆయన మీద మీమ్స్ కూడా చేసి వదులుతున్నారు మెంబర్లు. ఈ నేపథ్యంలో, గత కొంతకాలంగా ఆయన సోషల్ మీడియా అకౌంట్ నుంచి అయితే ఆక్టివ్‌గా లేరు. కానీ, తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేశారు. అది ఇప్పుడు వైరల్ అవుతుంది.

Also Read:Venu Swami: వేణు స్వామికి ఘోర అవమానం.. కామాఖ్య ఆలయం నుంచి గెంటివేత

“ఏంటి, నన్ను చాలా మిస్ అవుతున్నట్టు ఉన్నారు. వంశీ అది, వంశీ ఇది అని చాలా గ్రిప్పింగ్ నేరేటివ్ నడుస్తున్నాయి. పర్లేదు, ట్విట్టర్‌లో మంచి రైటర్స్ ఉన్నారు. కానీ,
మిమ్మల్ని అందరిని డిసప్పాయింట్ చేస్తున్నందుకు సారీ. నేను ఇంకా సినీ ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవడానికి పది, పదిహేనేళ్లు పడుతుంది. సినిమాల కోసం సినిమాలతో సిద్ధంగానే ఉంటాను,” అని పేర్కొన్న ఆయన, తమ సంస్థ నుంచి వస్తున్న మాస్ జాతర సినిమాతో కలుద్దామని చెప్పుకొచ్చారు. అయితే, రవితేజ హీరోగా భాను భోగవరపు డైరెక్షన్‌లో రూపొందుతున్న మాస్ జాతర సినిమా ఆగస్టు 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే, ఆ సినిమా రిలీజ్ వాయిదా పడే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు. కొంత షూటింగ్ పెండింగ్ ఉండడంతో పాటు, మరికొన్ని కారణాలతో సినిమా రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, ఈ విషయం మీద అధికారికంగా ఇప్పటివరకు ప్రకటన రాలేదు. ఇప్పుడు నాగవంశీ ట్వీట్‌లో కూడా ఆ విషయాన్ని ప్రస్తావించకపోవడంతో, వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు.

Exit mobile version