ఇటీవల జరిగిన కింగ్డమ్ సినిమా సక్సెస్ మీట్లో విజయ్ దేవరకొండ గురించి నాగవంశీ కామెంట్లు చేశారు. ఈ సినిమా సక్సెస్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ను కలుస్తున్నారా ? అని అడిగితే మా పవన్ కళ్యాణ్ విజయే అని అన్నారు. అయితే అది వివాదంగా మారడంతో తాజాగా నాగవంశీ స్పందించారు. ఈ విషయాలను కాంట్రవర్సీ చేసే సోకాల్డ్ జీనియస్ లకి చెబుతున్నాను. ఎప్పుడైనా ఒకరిని పొగడాలి అనుకోండి, హృతిక్ రోషన్ లాగా ఉన్నారు అంటారు కదా.
Also Read : OG : రప్పా బప్పా..ఓజీ ఫస్ట్ సాంగ్ అదిరిందిగా
అలాగే ఏ హీరో అయినా ఫస్ట్ రిఫరెన్స్ పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటాం. కాబట్టి మా సినిమాకి ఈయనే పవన్ కళ్యాణ్ అని అర్థం దానికి. అంటే విజయ్ పవన్ కళ్యాణ్ అంత గొప్పవాడు అయ్యాడో, పవన్ కళ్యాణ్ ను దాటేశాడు అనో కాదు. ఒక హీరో గురించి మాట్లాడాలంటే మనకి ఫస్ట్ నోట్లో నుంచి వచ్చేది పవన్ కళ్యాణ్ గారే కదా. అందుకే ఈయన మా పవన్ కళ్యాణ్ అన్నాను. దాన్ని కూడా కాంట్రవర్సీ చేస్తే ఏమనాలి? అంటే పవన్ కళ్యాణ్ అంత గొప్ప మనిషి అని అన్నాను అని నాగవంశీ చెప్పుకొచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ ను విజయ్ దేవరకొండతో కలిసి మాట్లాడిన విషయాలు కూడా పంచుకున్నారు.
