NTV Telugu Site icon

Naga Chaitanya : తండేల్ డిసెంబర్ లో రాదు.. కారణం ఇదే..

Thnde;l

Thnde;l

నాగ చైత‌న్య లేటెస్ట్ చిత్రం తండేల్‌. కార్తికేయ-2 వంటి బ్లాక్ బస్టర్ ను తెరకెక్కించిన దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో రానుంది తండేల్.గీతా ఆర్ట్స్ – 2 బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు అత్యంత భారీ బడ్జెట్ పై తండేల్ ను నిర్మిస్తున్నారు. ల‌వ్ స్టోరీ సినిమా తర్వాత నాగ చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి చేస్తున్నరెండవ సినిమా ఇది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా రిలీజ్ పై రోజుకొక డేట్ వినిపిస్తుంది.

Also Read : SDGM : సన్నీడియోల్ – గోపిచంద్ మలినేని టైటిల్ ఇదే..

వాస్తవానికి తండేల్ మొదట డిసెంబరు రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేశారు మేకర్స్. అందుకు అనుగుణంగా షూటింగ్ శరవేగంగా చేస్తున్నారు. కానీ వినిపిస్తున్న సమాచారం ప్రకారం తండేల్ డిసెంబరు రేస్ నుండి తప్పుకుంది. క్రిస్మస్ నాటికి సినిమా షూట్ కంప్లిట్ అవ్వదని అందుకే వెనకు వెళుతున్నారు. ఇప్పుడు డిస్కషన్స్ సంక్రాంతికి రావాలా వద్ద అనేది . సంక్రాంతికి గేమ్ ఛేంజర్ తో పాటు బాలయ్య బాబీ సినిమా వస్తోంది. ఆ రెండు సినిమాలకే మెజారిటీ థియేటర్లు వెళ్తాయి. తండేల్ కు అచ్చం గీతా థియేటర్లు మాత్రమే ఉంటాయి, అవి ఎక్కువగా లేవు. పోటీలో వచ్చి ఇబ్బంది పడే బదులు ఫిబ్రవరిలో సోలో రిలీజ్ చేద్దామని ఆలోచన కూడా ఉందట యూనిట్. ఓటీటీ డీల్ కూడా క్లోజ్ కాలేదు. సంక్రాంతికి వస్తే ఓటీటీ నుండి ఎక్కవు రాదు అందుకే ఇప్పుడువిడుదలపై తర్జన భర్జన నడుస్తుంది. కానీ ఎప్పుడు వచ్చిన తండేల్ హిట్ కొట్టడం గ్యారెంటీ అనేది ఇండస్ట్రీ టాక్. మరి అల్లు అరవింద్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి

Show comments