ముల్లేటి నాగేశ్వరరావు నిర్మాణ సారథ్యంలో ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరరావు నిర్మించిన ‘నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా’ చిత్రం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను జాతీయ ఉత్తమ నటుడు ప్రకాష్ రాజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘మూవీ టైటిల్ తనకు ఎంతో నచ్చింద’ని చెబుతూ, ఈ చిత్రంతో పరిచయం అవుతున్న వాళ్లందరికీ బంగారు భవిష్యత్తు ఉండాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఇలాంటి మంచి చిత్రానికి తన సపోర్ట్ ఉంటుందని చెప్పారు.
Read Also : మహేశ్ బాబు శ్రీరాముడు కాదట!
ఈ సందర్భంగా దర్శకుడు వెంకట్ వందెల మాట్లాడుతూ ‘ప్రకాష్ రాజ్ లాంటి జాతీయ నటుడి చేతులమీదుగా తన మొదటి చిత్రం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల కావడం ఆనందంగా ఉంద’న్నారు. తనను నమ్మి దర్శకుడిగా అవకాశమిచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాతలు ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ‘ఈ సినిమా ద్వారా హీరో, హీరోయిన్, దర్శకుడని పరిచయం చేస్తున్నామ’ని అన్నారు. ‘హుషారు’ ఫేమ్ గని కృష్ణతేజ్, అఖిల ఆకర్షణ, తనికెళ్ళ భరణి, జీవా, జోగిబ్రదర్, అనంత్, ‘బస్టాప్’ కోటేశ్వరరావు, డాక్టర్ ప్రసాద్, మాధవి ప్రసాద్, సునీత మనోహర్, కల్పన రెడ్డి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.