Site icon NTV Telugu

Pushpa 2 The Rule: మెగా ఫ్యామిలీతో విభేదాలు.. పుష్ప 2పై ప్రభావం చూపిస్తాయా ?

Pushpa Raj

Pushpa Raj

చెప్పిన డేట్ కంటే ఒకరోజు ముందుగానే రిలీజ్ కి రెడీ అవుతోంది పుష్ప సెకండ్ పార్ట్. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని డిసెంబర్ 6వ తేదీ రిలీజ్ చేస్తామని ముందు ప్రకటించారు. కానీ ఇప్పుడు డిసెంబర్ 5వ తేదీనే రిలీజ్ చేస్తున్నామని నాలుగో తేదీ అమెరికాలో ప్రీమియర్స్ కూడా పడతాయని నిర్మాత ప్రకటించారు. ఈ సందర్భంగా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ డిస్ట్రిబ్యూటర్లను మీడియాకు పరిచయం చేశారు. ఇక ఈ సందర్భంగా క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్ నిర్వహించగా అందులో మీడియా అడిగిన పలు ప్రశ్నలకు మైత్రి నిర్మాతలతో పాటు డిస్టిబూటర్స్ సైతం సమాధానాలు ఇచ్చారు. అయితే అందులో ఒక షాకింగ్ ప్రశ్న ఎదురైంది అదేమిటంటే పుష్ప మొదటి భాగం రిలీజ్ అయ్యే నాటికి మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్ కి ఎలాంటి విభేదాలు లేవని, అప్పటికి అందరూ ఒకే గూటి కింద ఉన్నారు. కానీ 2024 ఎన్నికల సమయంలో నంద్యాల వెళ్లి వచ్చిన తర్వాత విభేదాలు మొదలయ్యాయి అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఆ ఎఫెక్ట్ సినిమా మీద ఏమైనా ఉంటుందా అని ప్రశ్నించారు మీడియా ప్రతినిధులలలో ఒకరు.

Pushpa 2 : జానీ మాస్టర్ కి బెయిల్ వచ్చినా నిరాశే

దానికి మైత్రి నిర్మాత నవీన్ స్పందిస్తూ అవన్నీ ప్రచారాలే కేవలం ఎన్నికల సమయంలో కొంత డిస్టబెన్స్ ఉండి ఉండవచ్చు కానీ ఇప్పుడేమీ లేదు సినిమాని చూసి మెగా అభిమానులు సైతం ఆదరిస్తారని అన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని అనుకుంటున్నారని ఆయన అన్నారు. పొలిటికల్ గా ఆయన ఏమీ డివైడ్ అవ్వలేదు నిజానికి ఆయన ఏ పార్టీలో లేరు మీరు ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్ కాదని మరో నిర్మాత మైత్రి రవి చెప్పుకొచ్చారు. దయచేసి ఆ పదం ఎడిట్ చేసి తీసేయండి ఆయనకు పొలిటికల్ గా ఎవరితోనూ సంబంధం లేదు. సినిమా కోసం అన్ని వర్గాల వారు అన్ని హీరోల అభిమానులు ఎదురుచూస్తున్నారు అన్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు.

Exit mobile version