చెప్పిన డేట్ కంటే ఒకరోజు ముందుగానే రిలీజ్ కి రెడీ అవుతోంది పుష్ప సెకండ్ పార్ట్. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని డిసెంబర్ 6వ తేదీ రిలీజ్ చేస్తామని ముందు ప్రకటించారు. కానీ ఇప్పుడు డిసెంబర్ 5వ తేదీనే రిలీజ్ చేస్తున్నామని నాలుగో తేదీ అమెరికాలో ప్రీమియర్స్ కూడా పడతాయని నిర్మాత ప్రకటించారు. ఈ సందర్భంగా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ డిస్ట్రిబ్యూటర్లను…