Site icon NTV Telugu

Mamitha baiju: బాయ్స్ గెట్ రెడీ ఫర్ లవ్ టుడే విత్ ప్రేమలు!

Mamatabaiju

Mamatabaiju

Mamitha baiju: నటీనటులు ఓవర్ నైట్ స్టార్ అవ్వడానికి ఒక్క మంచి సినిమా చాలు. అలా తెలుగులో సూపర్ క్రేజ్ దక్కించుకున్న హీరోయిన్ మమితా బైజు. ఈ మధ్యకాలంలో సూపర్ హిట్ గా నిలిచిన మలయాళ ప్రేమలు సినిమాలో ఆమె హీరోయిన్గా నటించింది. వాస్తవానికి ఇప్పటికే చాలా మలయాళ సినిమాలు చేసింది కానీ ఈ ప్రేమలు సినిమాతో తెలుగు తమిళ ఆడియన్స్ కి బాగా దగ్గరయింది. ఇప్పుడు ఆమె ఒక తెలుగు సినిమా సైన్ చేసినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఆమె పలువురు తెలుగు హీరోల సినిమాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటూ గతంలో చాలా వార్తలు వచ్చాయి. కానీ ఆమె ఒక ఆసక్తికరమైన ప్రాజెక్టులో భాగమైంది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా మమిత బైజు హీరోయిన్ గా మైత్రి మూవీ మేకర్స్ ఒక సినిమా నిర్మించేందుకు రెడీ అయింది.

Also Read: Akash Puri: పేరు మార్చుకున్న ‘పూరీ’ కుమారుడు.. కారణం అదేనా?

గతంలో లవ్ టుడే అనే సినిమాతో ప్రదీప్ రంగనాథన్ హీరోగా దర్శకుడిగా ఏకకాలంలో ప్రూవ్ చేసుకున్నాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమాని తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేస్తే మంచి లాభాలు కూడా వచ్చాయి. ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా మమితా బైజు హీరోయిన్గా ఒక సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సెట్ చేసింది. డైరెక్టర్ వివరాలు ఇంకా ఫైనల్ కాలేదు కానీ వీరిద్దరి కాంబోలో ఒక మూవీ అయితే సెట్ అయినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతానికి లవ్ టుడే సినిమాని హిందీలో రీమేక్ చేసే పనిలో ఉన్నాడు. ప్రదీప్ రంగనాథన్ ఆ సినిమా పనులు పూర్తయిన తర్వాత ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతేకాక తమిళంలో కూడా పలు సినిమాలకు ప్రదీప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరో పక్క మమిత మలయాళం లో పలు సినిమాలతో బిజీగా ఉంది.

Exit mobile version