NTV Telugu Site icon

Pushpa 2: మహిళ మృతిపై స్పందించిన మైత్రీ మూవీ మేకర్స్

Mythri

Mythri

అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఒక రోజు ముందుగానే దీనికి సంబంధించిన ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఇక ఈ ప్రీమియర్ షోస్ లో ఒక దానికి అల్లు అర్జున్ హాజరయ్యాడు. హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ వద్ద అల్లు అర్జున్ రాక నేపథ్యంలో ఒక తొక్కిసలాట ఏర్పడింది. హీరో రావడంతో జనం భారీ ఎత్తున ఆయనను కలిసేందుకు కరచాలనం చేసేందుకు ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపించడంతో తొక్కిసలాటకు దారితీసింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే 39 ఏళ్ల మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు తొమ్మిదేళ్ల శ్రీతేజ్ ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ విషయం మీద ఇప్పటివరకు అల్లు అర్జున్ కానీ సినిమా నిర్మాణ సంస్థ కానీ స్పందించలేదు.

Honey Rose: బాలయ్యతో కయ్యానికి సిద్దమైన హనీ రోజ్!!

తాజాగా విమర్శల నేపద్యంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ విషయం మీద సోషల్ మీడియా వేదికగా స్పందించింది. నిన్న రాత్రి జరిగిన సంఘటన హృదయ విదారకమైనదని, తాము చాలా బాధపడుతున్నామని పేర్కొన్నారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆ బాలుడి గురించి మేమంతా ఆలోచిస్తున్నాం, ఆ బాలుడు గురించే ప్రార్థనలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ విపత్కర సమయంలో వారికి అన్ని విధాలుగా అండగా ఉంటూ సపోర్ట్ అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ప్రకటించింది. అయితే ఇప్పటికే ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ మీద నిర్మాతల మీద కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Show comments