టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమాలో నటిస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘SSMB29’ మీదనే మహేష్ ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఈ సినిమా షూటింగ్‌కు దాదాపు మూడు సంవత్సరాలు పైబడే సమయం పట్టె అవకాశం ఉందని సమాచారం. ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ పాన్-ఇండియన్ స్టార్‌గా ఎదిగినట్టే, ఈ సినిమా తర్వాత మహేష్ బాబు కూడా అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ పొందే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే మహేష్ మాత్రం తొందరపడకుండా, తన కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేస్తూ రాజమౌళి ప్రాజెక్ట్‌పై దృష్టి సారిస్తున్నాడు.
Also Read : Prabhas’ Fauji: ఫౌజీ రిలీజ్ ఆరోజే?
ఇక రాజమౌళి ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత, అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ మహేష్ బాబును ఒక సినిమా సంప్రదించింది. ఈ ప్రాజెక్ట్ కోసం వారు భారీ మొత్తంలో అడ్వాన్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. అయితే, మహేష్ బాబు ఈ ప్రతిపాదనను ఇంకా అంగీకరించలేదు అలా అని తిరస్కరించలేదు. తన కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకునే అలవాటున్న మహేష్, ఈ ప్రాజెక్ట్‌పై సమయం తీసుకుని నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అంతేకాక మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాకు అగ్ర దర్శకుడిని ఎంపిక చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్, నెల్సన్ దిలీప్‌కుమార్ వంటి ప్రముఖ దర్శకులతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ దర్శకులు తమ శైలిలో మహేష్ బాబును కొత్త రేంజ్లో పరిచయం చేసే అవకాశం ఉంది.మహేష్ మైత్రీతో శ్రీమంతుడు , సర్కారు వారి పాట సినిమాలు చేశారు