NTV Telugu Site icon

RGV : నా కళ్లు మూసుకుపోయాయి.. ఇకపై మంచి సినిమాలే చేస్తా

Rgv

Rgv

రామ్‌ గోపాల్‌ వర్మ అంటే ఒకప్పుట్లో ఒక బ్రాండ్. తన సినిమాలతో డైరెక్షన్ తో బెంచ్ మార్క్ సెట్ చేసాడు ఆర్జీవీ. కానీ అదంతా గతం. ఇప్పుడు ఆర్జీవీ అంటే బూతు బొమ్మల సినిమాలు తీసే దర్శకుడు. అందుకు తన నిర్ణయాలే కారణమని తెలియజేస్తూ ఎక్స్ ఖాతాలో సంచలన పోస్ట్ చేసాడు ఆర్జీవీ. జేడీ చక్రవర్తి, మనోజ్‌ బాజ్‌పాయ్‌ కీలక పాత్రల్లో ఆర్జీవీ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘సత్య’. దాదాపు 27 ఏళ్ల కిత్రం విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఇటీవల ఈ సినిమా రీరిలీజ్ అయిన నేపథ్యంలో ఈ సినిమాను చుసిన ఆర్జీవీ ఈ విధంగా రాసుకొచ్చాడు.

Also Read : Thug Life : ఆ రెండు రాష్ట్రాల ‘థగ్ లైఫ్’ థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు!

దాదాపు 27 సంవత్సరాల తర్వాత మొదటిసారి రెండు రోజుల క్రితం సత్య చూసాను. చూస్తున్నంత సేపు నాకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు వచ్చేసాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు తలుచుకుంటే కన్నీళ్లు ఆగలేదు. సినిమా తీయడం అంటే పసి బిడ్డకు  జన్మనివ్వడం లాంటిది. పురిటిలో బిడ్డ ఎలా పురుడుపోసుకుంటుందో సినిమా కూడా అంతే. సినిమా హిట్ అయినా కాకున్నా నేను ముందుకు సాగుతూ వచ్చాను. 2 రోజుల క్రితం సత్య సినిమా చూసి హోటల్‌కు తిరిగి వచ్చి చీకటిలో కూర్చుని ఆలోచిస్తున్నప్పుడు ఇంత గొప్ప జానర్‌ సినిమాను నేనే తీశాను అనే ఆనందంలో కన్నీళ్లు వచ్చాయని అర్థమైంది. ‘సత్య’ లాంటి గొప్ప సినిమా చూసి నాపై ఎంతోమంది పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోయను అనిపించి కన్నీళ్లు వచ్చాయి. ఈ సినిమాను నేను బెంచ్‌మార్క్‌గా ఎందుకు పెట్టుకోలేదని అనిపించింది.

Also Read : Daaku Maharaaj : డాకు మహారాజ్ విజయోత్సవ పండుగకు భారీ ఏర్పాట్లు

రంగీలా, సత్య వంటి సూపర్ హిట్ సినిమాలు చేసాక ఆ గర్వంతో  నా కళ్లు మూసుకుపోయాయి. ఆ తర్వాత నా ఇష్టం వచ్చినట్లు సినిమాలు తీశా. ఆ రెండు సినిమాలు ఇచ్చిన విజయం, అహంకారం, పొగరుతో నా కళ్లునెత్తికెక్కాయి. మద్యానికి బానిసై తాగుబోతుగా మారాను. సత్య’ గొప్పతనం రెండు రోజుల ముందు దాన్ని మరోసారి చూసేవరకూ అర్థం కాలేదు.  సత్య కారణంగా నన్ను నమ్మిన వారందరికీ నేను చేసిన ద్రోహాలకు నేను ఎంతో భాధపడుతూ ఏడ్చాను. నా అతి తెలివితేటలతో అలాగే జిమ్మిక్కులతో అర్థంపర్థంలేని సన్నివేశాలతో కథ, కథనాలను పక్కన పడేసి కేవలం భూతు సినిమాలు మాత్రమే తీశా.  చిన్నచిన్న కథలతోనూ అద్భుతమైన సినిమాలు చేయొచ్చు. కానీ నేను అలా చేయలేదు.  రంగీలా, సత్య తర్వాత నేను ఎన్నో సినిమాలు చేశా కానీ సత్యలో ఉన్న గొప్పతనం వాటిలో లేదు. నా ప్రతిభకు ఇండస్ట్రీ ఎన్నో అవకాశాలు ఇచ్చింది. కానీ నేను వాటిని సరిగా ఉపయోగించుకోలేదు.  అందుకే నా కన్నీళ్లను తుడుచుకుంటూ 2 రోజుల క్రితం ఓ వాగ్దానం చేసుకున్నాను. ఇకపై నేను చేసే ప్రతి సినిమా దర్శకుడిగా నా గౌరవాన్ని పెంచేలా ఉండాలని నిర్ణయించుకున్నా. ‘సత్య’ లాంటి సినిమాను మరోసారి తీయలేకపోవచ్చు. కనీసం ఆ జానర్‌ సినిమాలైనా తీయలేకపోతే నేను సినిమాలకు ద్రోహం చేసినవాడిని అవుతాను. నేను మళ్ళీ సత్య లాంటి సినిమా చేయలేకపోవచ్చు, కానీ అలా చేయాలనే ఉద్దేశ్యం కూడా లేకపోవడం సినిమాపై క్షమించరాని నేరం. సత్య లాంటి సినిమాలు చేస్తూనే ఉండాలని నా ఉద్దేశ్యం కాదు. నేను కాలంలో వెనక్కి వెళ్లి, నా కోసం ఒక నియమాన్ని ఏర్పరచుకున్నానని నేను కోరుకుంటున్నాను, ఏదైనా సినిమా తీయాలని నిర్ణయించుకునే ముందు, నేను మరోసారి సత్యను చూడాలి. నేను ఆ నియమాన్ని పాటిస్తే, అప్పటి నుండి నేను చేసిన 90% సినిమాలు నేను చేసి ఉండేవాడిని కాదని నాకు ఖచ్చితంగా తెలుసు. చివరగా ఇప్పుడు నా జీవితంలో మిగిలి ఉన్నా సమయాన్ని సత్య వంటి మంచి సినిమాలు చేస్తానని ఈ సత్యాన్ని నేను ‘సత్య’ పై ప్రమాణం చేస్తున్నాను’ అని పోస్ట్ చేసాడు రామ్ గోపాల్ వర్మ.