Nilave: మ్యూజికల్ మ్యూజికల్ డ్రామా ‘నిలవే’ టీజర్ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ ఇండస్ట్రీలో ఎవరి పరిచయం లేదు.. వారెవరో ఎవరికీ తెలియదు. అయితే సినిమా అంటే చెప్పలేనంత ప్రేమ, అభిరుచి, ఉత్సాహం అదే వారిని ముందడుగు వేసేలా చేసింది. తెలుగు సినిమాలో అతి పెద్ద మ్యూజికల్ డ్రామా రూపొందించేలా చేసింది. ఆ చిత్రమే ‘నిలవే’. సౌమిత్ రావు, శ్రేయాసి సేన్ జంటగా నటించిన ఈ చిత్రానికి సౌమిత్ రావు మరియు సాయి వెన్నం దర్శకత్వం వహించారు. POV ఆర్ట్స్ వ్యూ
ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తాహెర్ సినీ టెక్‌తో సౌజన్యంతో సాయి వెన్నం, గిరిధర్ రావు పోలాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
▶https://youtu.be/_QjT_yc6fAI
Also Read
సోమవారం ఈ సినిమా టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఇందులో అర్జున్ (సౌమిత్ రావు) అనే వ్యక్తి, తన ఒంటరి జీవితాన్ని కష్టంగా గడుపుతూ ప్రేమ కోసం తాపత్రయ పడుతూ ఉంటాడు. అలాంటి అతని జీవితంలోకి.. శ్రేయాసి సేన్.. ప్రవేశించి అతని జీవితంలో కొత్త కాంతిని తీసుకొస్తుంది. ఇక టీజర్ మొత్తం.. ఆ అమ్మాయి కోసం అతను ఎంత దూరమైనా వెళ్తారు అనేదాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు
“నిలవే” టీజర్ నిడివి కేవలం 155 సెకండ్లు మాత్రమే.. అయినప్పటికీ.. ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకుంది అనడంలో సందేహం లేదు. అద్భుతమైన విజువల్స్.. మనసును తాకే సంగీతంతో, ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా.. ఈ చిత్రంపై అంచనాలను కూడా పెంచేసింది. సౌమిత్ రావు, శ్రేయాసి సేన్ కెమిస్ట్రీ ఈ సినిమాకి హైలైట్ గా నిలబడింది అని టీషర్ట్ చూస్తేనే అర్థమవుతుంది. వీరితో పాటు హర్ష చెముడు, సుప్రియా ఐసోలా, రూపేష్ మారాపు, జీవన్ కుమార్, గురురాజ్, సిద్ధార్థ్ గోల్లపూడి, అనాల సుశ్మిత మరియు ఇతరులు సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకి కళ్లాన్ నాయక్ అందించిన సంగీతం మరింత హైలైట్ గా నిలవనుంది. వెంకట్ కొణకండ్ల, సంజనా కృష్ణ ఈ చిత్రానికి సహ నిర్మాతలు.
- Tags
- nilave
- nilave teaser
తాజావార్తలు
-
Hero Xtreme 250R Carbon: హీరో Xtreme 250R Carbon బైక్ లాంచ్.. క్రూయిజ్ కంట్రోల్, 8.5 సెకన్స్ లో 100 kmph వేగం!
-
Bhumana Karunakar Reddy: ఎంపీలపైనే దాడులు చేస్తారా? దమ్ముంటే ఎన్నికల్లో గెలవండి.. భూమన సవాల్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Neha Sharma : దాక్కున్నా వదిలిపెట్టను.. ఆ వీడియోలు వెంటనే డిలీట్ చేయండి: హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
-
AP Local Body Elections: కూటమి నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. ఎన్నికల వ్యూహంపై చర్చ
ట్రెండింగ్
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్‌లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?