Music ‘N’ Play : బ్యూటిఫుల్ సింగర్స్ దామిని, యామినితో సాకేత్ సూపర్ ఫన్ షో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ సండే ‘మ్యూజిక్ ఎన్ ప్లే విత్ సాకేత్’ షోకు మోస్ట్ బ్యూటిఫుల్ సింగర్స్ దామిని, యామిని హాజరయ్యారు. దాదాపు యాభై నిమిషాల పాటు సాగిన ఈ ఎపిసోడ్ లో ఈ క్యూట్ సింగర్స్ బోలెడన్ని కొత్త విషయాలను వ్యూవర్స్ కు తెలియచేశారు. లెహరాయి సాంగ్ తో మొదలైన ఈ కార్యక్రమం ‘ఖిలాడీ’ టైటిల్ సాంగ్ ను హమ్ చేయడంతో పూర్తయ్యింది. ఈ షోకు హాజరయిన దామిని, యామినిలోని కామన్ థింగ్స్ గురించి తెలిపాడు సాకేత్. ‘బాహుబలి’ మొదలుకొని మొన్నటి ‘కొండపొలం’ వరకూ వీరిద్దరూ 80 నుండి 90 శాతం చిత్రాలలో కలిసి పాటలు పాడారు. పైకి స్నేహితులుగా ఉన్నా ఒకరితో ఒకరు టామ్ అండ్ జెర్రీలా ప్రవర్తిస్తారనే నిజాన్ని సాకేత్ రివీల్ చేసేశాడు.
దామిని పరువు తీసిన సాకేత్!
ఎవరైనా చిన్నప్పుడు కాస్తంత అల్లరిగానూ, చిలిపిగానూ ఉంటారు. అది సహజం. ఓసారి దామిని ని ఆమె అక్క డ్రైనేజీలోకి తోసేసిన సంఘటనను గుర్తు చేసి, ఆమె అందులోంచి ఎలా బయటపడిందో చెప్పించాడు. అక్కడితో ఆగితే సాకేత్ ఎందుకు అవుతాడు! ఆ స్కూల్ కు వెళ్ళే రోజుల్లో దామిని తోటి పిల్లల పెన్సిల్స్, ఎరైజర్స్ ను దొంగిలించి ఎక్కడ దాచేదో కూడా చెప్పేశాడు సాకేత్. అయితే… ప్రస్తుతం దామినిలోని ఎంటర్ పెన్యూర్ గురించి చెప్పి, ఆమెను ప్రత్యేకంగా అభినందించాడు. మర్చెంటైజ్ లో భాగంగా బాలుగారి టీషర్ట్స్ ను దామిని ప్రత్యేకంగా డిజైన్ చేసి విక్రయిస్తున్న విధానాన్ని, ఆ మధ్య కేరళ వెళ్ళి కుండలు తయారు చేయడాన్ని చేర్చుకున్న పద్థతిని అప్రిషియేట్ చేశాడు.
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
అనిరుధ్ గురించిన సూపర్ సీక్రెట్!
రెగ్యులర్ గా జరిగే బొమ్మలు చూసి పాటను గెస్ చేసే సిగ్మెంట్ లో సత్య యామిని తన బుర్రకు పదను పెట్టి… రెండు పాటలను కరెక్ట్ గా చెప్పగలిగింది. దామిని మాత్రం ఒక్క పాటనే గెస్ చేయగలిగింది. ఆ తర్వాత ఓ సరికొత్త ఆటను వీరితో ఆడించాడు సాకేత్. తొమ్మిది మంది సంగీత ప్రముఖుల ఫోటోలను పెట్టి… ఒక్కో సింగర్ తో మూడు సార్లు బాణం వేయించి, అది ఎవరి ఫోటోను తాకితే వారి గురించి చెప్పమన్నాడు. అందులో యామిని కీరవాణి, మణిశర్మ, బాలు గురించి తనకున్న క్యూట్ ఎక్స్ పీరియన్స్ ను షేర్ చేసుకుంది. ఇక దామిని అయితే చిత్ర, కోటి, అనిరుధ్ గురించి తన అనుభవాలను తెలిపింది. బేసికల్ గా మ్యూజిక్ డైరెక్టర్ అయిన అనిరుధ్ వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గరకి పాట పాడటానికి వెళ్ళినప్పుడు పైసా కూడా రెమ్యూనరేషన్ తీసుకోని విషయాన్ని దామిని తెలిపింది. అలానే కోటిగారి స్టైలింగ్ కు తాను ఫిదా అవుతానని చెప్పింది. ఇదే సమయంలో కోటిగారి సహృదయత గురించి సత్య యామిని కూడా ఒకప్పటి తన అనుభవాన్ని తెలిపింది.
రేవంత్, రోహిత్ లను పక్కన పెట్టిన ఆ ఇద్దరూ!
యామిని, దామిని తమకిష్టమైన రెండు పాటలను పాడిన తర్వాత లాస్ట్ సిగ్మెంట్ లోకి ఎంటర్ అయ్యాడు సాకేత్. ర్యాపిడ్ ఫైర్ లో మన అందాల భామలు జనరల్ నాలెడ్జ్ విషయంలో తాము జీరోస్ అని మరోసారి నిరూపించుకున్నారు. రామలక్ష్మణుల గురువును, భారత ఆర్థిక శాఖా మంత్రి పేరును దామిని చెప్పలేకపోయింది. గోవా రాజధాని పేరు, తమిళనాడు సీఎం పేరుకు యామిని బదులివ్వలేకపోయింది. పృధ్వీతో పాడటాన్ని లవ్ చేస్తానని, అనురాగ్ తో ఎడ్జస్ట్ అవుతానని, రేవంత్ ను అవాయిడ్ చేస్తానని దామిని చెప్పగా, అనుదీప్ తో పాడటాన్ని ఇష్టపడతానని, హేమచంద్రతో అడ్జస్ట్ అవుతానని, రోహిత్ తో ఇప్పటికే ఓ పాట పాడాను కాబట్టి అవాయిడ్ చేస్తానని యామిని తెలిపింది. మొత్తం మీద ఈ బ్యూటిఫుల్ సింగర్స్ ఈ వీకెండ్ లో సూపర్ ఫన్ ను వ్యూవర్స్ కు అందించారు. మరి ఆలస్యం ఎందుకు… మీరూ ఈ ఎపిసోడ్ ను చూసి ఎంజాయ్ చేసేయండి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!