NTV Telugu Site icon

Harshavardhan: ‘స్పిరిట్’ కోసం కసిగా పనిచేస్తున్నాను

Untitled Design (66)

Untitled Design (66)

ఇండియా స్టార్ ప్రభాస్ ప్రజంట్ నాలుగు సినిమాలను లైన్‌లో పెట్టాడు.ఇందులో  ‘స్పిరిట్’ మూవీ ఒకటి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమా ఓ పవర్‌ ఫుల్ కాప్ స్టోరీగా రాబోతుంది. దాదాపు రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్‌తో స్పిరిట్ చిత్రాన్ని టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించనున్నారు. ఇందులో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపిస్తున్నాడు. దీంతో ప్రభాస్ ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ విషయంలో సందీప్, రాజమౌళిని ఫాలో అవుతున్నాడట..

Also Read: Priya : ‘రెడ్ శారీ’లో గార్జియస్ ప్రియాప్రకాష్ వారియర్

జక్కన్న లాగానే తన సినిమాలో న‌టించే న‌టిన‌టుల‌తో పాటు హీరో హీరోయిన్లకి కూడా ఎటువంటి అప్‌డేట్స్ బ‌య‌ట‌పెట్టవ‌ద్దని సందీప్ రెడ్డి వంగ బాండ్ రాసుకోబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ లుక్‌కి సంబంధించి కూడా సందీప్ కండిష‌న్స్ పెట్టబోతున్నాడట. మూవీలో ప్రభాస్ లుక్ కీల‌కం అని.. ఒక‌వేళ సినిమా షూటింగ్ మ‌ధ్యలో లుక్ మార్చుకున్న సినిమాకి ఎఫెక్ట్ ప‌డుతుందని అందుక‌నే ఏది మార్చకుండా సినిమా అయ్యేవ‌ర‌కు ప్రభాస్ అలానే ఉండలాని సందీప్ ఫిక్స్ అయ్యాడట. ఇక ఇప్పటికే ఈ మూవీ గురించి రోజుకో వార్త బయటకు వస్తున్నప్పటికి, తాజాగా ఈ మూవీ గురించి అదిరిపోయే న్యూస్‌ను షేర్ చేశారు..

‘స్పిరిట్’ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా హర్షవర్ధన్ క్రేజీ కామెంట్స్ చేశారు.. ‘డార్లింగ్ ప్రభాస్‌కి నేను వీర అభిమానిని.అందుకే ఈ చిత్రం కోసం కసిగా పనిచేస్తున్నాను. కచ్చితంగా మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. అద్భుతమైన సంగీతం అందిస్తాను. ప్రస్తుతం సందీప్‌ రెడ్డితో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ఇక ఈ మూవీలో మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుంది. సందీప్ రెడ్డి వంగా నుంచి మరో వినూత్న సినిమా రాబోతుంది.. ఈ విషయంలో మీకు ఫుల్ మీల్స్ పక్క’ అని తెలిపారు.