టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతున్న నేపథ్యంలో మరోసారి స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. అయితే ఈ క్రమంలో ఫ్యాన్స్ మధ్య అనవసరమైన వార్ మొదలవడం చర్చనీయాంశంగా మారింది. అసలు విషయం ఏంటంటే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన మురారి సినిమా నూతన సంవత్సర కానుకగా ఈ నెల 31న మరోసారి థియేటర్లలో రీ రిలీజ్ కానుంది. ఈ సినిమాకు ఇప్పటికీ ఫ్యామిలీ ఆడియెన్స్ లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది.
Also Read : Dhurandhar : 8 ఏళ్లు బాహుబలి – 2 రికార్డ్ ను బద్దలు కొట్టిన ధురంధర్
ఇక మరోవైపు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ జల్సా. ఈ సినిమా కూడా అదే రోజున రీ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. విశేషం ఏంటంటే, జల్సా సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఇచ్చారు. ఇది ఈ రెండు సినిమాల మధ్య ఉన్న ప్రత్యేకమైన కనెక్షన్‌గా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు కొంతమంది అభిమానులు దీనిని మురారి vs జల్సా అంటూ ఫ్యాన్స్ వార్‌గా మారింది. తమ హీరో సినిమాకు ఎక్కువ కలెక్షన్స్ వస్తాయంటే మా హీరోకు వస్తాయని ట్వీట్ వార్ చేసుకుంటున్నారు. తెలంగాణలో మురారి 4Kను టాలీవుడ్ బడా నిర్మాణసంస్ట దిల్ రాజు సంస్థ SVC రీరిలీజ్ చేస్తోంది. ఈ రెండు సినిమాలతో పాటు విక్టరీ వెంకీ నువ్వు నాకు వచ్చావ్ కూడా రీరిలీజ్ కాబోతుంది. మరి పవర్ స్టార్ VS సూపర్ స్టార్ పోటీలో ఎవరు గెలుస్తారో చూడాలి.
