‘ముగ్గురు మొనగాళ్లు’ విడుదల తేదీ ఖరారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ హాస్యనటుడు శ్రీనివాస్ రెడ్డి ‘గీతాంజలి’, ‘జయమ్ము నిశ్చయమ్మురా’ వంటి సినిమాల్లో హీరోగానూ నటించి మెప్పించాడు. ప్రస్తుతం అతను ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించబోతున్నాడు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో చిత్రమందిర్ స్టూడియోస్ పతాకంపై అచ్యుత్ రామారావు ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీనివాస్ రెడ్డి మెయిన్ లీడ్ రోల్ చేస్తుండగా, దీక్షిత్ శెట్టి (కన్నడ హిట్ మూవీ ‘దియా’ ఫేమ్), వెన్నెల రామారావు ప్రధాన పాత్రలు పోషించారు.
Read Also : రాజ్ కుంద్రా చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు… కీలక ఆధారాలు లభ్యం
Also Read
వీరిలో ఒకరికి కనిపించదు. మరొకరికి వినిపించదు. ఇంకొకరు మూగ. ఈ ముగ్గురు దివ్యాంగుల జీవితంలో ఊహించని విధంగా క్రైమ్ చోటు చేసుకుంటుంది. అదేమిటీ? దాని నుండి వీరు ఎలా బయటపడ్డారు? అసలు నగరంలో జరిగే హత్యలకు వీళ్ళకు ఏమిటీ సంబంధం? అనేదే ఈ చిత్ర కథ. ఆ మధ్య విడుదలైన ట్రైలర్ సినిమా మీద ఆసక్తిని రెట్టింపు చేసింది. ఈ ‘ముగ్గురు మొనగాళ్ళు’ సినిమాను ఆగస్ట్ 6న విడుదల చేయబోతున్నట్టు దర్శక నిర్మాతలు తెలిపారు. త్విష్ శర్మ, శ్వేతా వర్మ, నిజర్, రాజా రవీంద్ర, జెమిని సురేష్, జోష్ రవి, బద్రం, సూర్య, జబర్తస్త్ సన్నీ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు సురేశ్ బొబ్బిలి సంగీతం సమకూర్చారు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!