తెలుగు సినీ పరిశ్రమలో మళ్ళీ ‘కంటెంట్’ రాజ్యమేలుతోంది. స్టార్ పవర్ కంటే కథా బలమే మిన్న అని నిరూపిస్తూ, యువ నటుడు రోషన్ కనకాల నటించిన ‘మోగ్లీ’ బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తోంది. పెద్ద సినిమాల హోరులో కూడా ఒక చిన్న సినిమా ఇంతటి ఘనవిజయాన్ని అందుకోవడం ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. సాధారణంగా చిన్న సినిమాలకు థియేటర్ల వద్ద ఆదరణ లభించడం ఈ రోజుల్లో కత్తిమీద సాము లాంటిది. కానీ, ‘మోగ్లీ’ సినిమా కేవలం ఏడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కును చేరుకోవడమే కాకుండా, ప్రాఫిట్ జోన్‌లోకి ప్రవేశించింది.
Also Read :Andhra King Thaluka OTT Release: ఓటీటీలోకి ‘ఆంధ్ర కింగ్ తాలూకా’… స్ట్రీమింగ్ ఏ రోజున అంటే!
ఈ సినిమా బడ్జెట్ సుమారు 8 కోట్ల రూపాయలు. థియేట్రికల్ రన్ మరియు నాన్-థియేట్రికల్ (ఓటిటి, శాటిలైట్) హక్కుల ద్వారా ఇప్పటివరకు దాదాపు 10 కోట్ల రూపాయల మార్కును తాకింది. రెండో వారంలోకి అడుగుపెడుతున్నా, థియేటర్ల వద్ద ఈ సినిమా జోరు తగ్గకపోవడం విశేషం. ఈ సినిమా విజయంతో రోషన్ కనకాల టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. గత చిత్రాలతో పోలిస్తే, ‘మోగ్లీ’లో ఆయన నటనలో ఎంతో పరిణతి కనిపిస్తోంది. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లలో రోషన్ జీవించారు. లవ్ స్టోరీలో ఉండే పెయిన్‌ను, ఎమోషన్‌ను పండించడంలో ఆయన సఫలీకృతమయ్యారు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో ఆయన నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.
Also Read :Sandeep Reddy Vanga: ‘ధురంధర్’పై సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రివ్యూ!
సినిమా విజయంలో విలన్ పాత్ర పోషించిన బండి సరోజ్ కుమార్ పాత్రను విస్మరించలేం. హీరో పాత్రకు ధీటుగా, అత్యంత ఇంటెన్సిటీతో ఆయన పండించిన విలనిజం సినిమాకు వెన్నుముకగా నిలిచింది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను థ్రిల్ కి గురిచేస్తోంది. పరిమిత బడ్జెట్‌లో క్వాలిటీ సినిమాను ఎలా తీయవచ్చో దర్శకుడు సందీప్ రాజ్ మరోసారి నిరూపించారు. కథలోని ఆత్మను దెబ్బతీయకుండా, సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో సినిమాను తెరకెక్కించి ఆకట్టుకున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేతలు టి.జి. విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ కంటెంట్‌ను నమ్మి చేసిన ఈ ప్రయోగం సక్సెస్ అవ్వడం, రాబోయే చిన్న సినిమాలకు ఒక పెద్ద బూస్ట్ అని చెప్పవచ్చు.
