Site icon NTV Telugu

Tollywood : సినిమా షూటింగ్స్ బంద్.. ఈ భారీ సినిమాల పరిస్థితి ఏంటి?

Tollywood (1)

Tollywood (1)

టాలీవుడ్ లో మరోసారి బంద్ సైరన్ మోగింది. తమకు రోజు వారి వేతనాలు నేటి నుంచి 30% పెంచాలని అలా పెంచిన వారికి మాత్రమే పని చేస్తామని ఫెడరేషన్ నాయకులు తేల్చి చెప్పారు. 30% వేతనం పెంచిన ప్రొడ్యూసర్ కే షూటింగ్ కే వెళ్ళాలి అని ఫెడరేషన్ నిర్ణయించారు. అందుకు ఫిల్మ్ ఛాంబర్ ఒప్పుకోక పోవడంతో  టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్  కానున్నాయి. దింతో ఎక్కడ షూటింగ్స్ అక్కడ నిలిచిపోయాయి. ఈ రోజు పూజ కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సిన సినిమాలు కూడా వాయిదా వేసాయి. కెమెరా డిపార్టంట్ మెంట్ కూడా ఈ బంద్ లో పాల్గొని నిరసన తెలుపుతున్నాయి.

Also Read : Tollywood : నిర్మాతలకు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హెచ్చరిక

ప్రస్తుతం టాలివుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. యంగ్ టైగర్ డ్రాగన్ రెబల్ స్టార్ రాజాసాబ్, బాలయ్య అఖండ 2, మెగా 157, పవర్ స్టార్ ఉస్తాద్ భగత్ సింగ్, రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా, ప్రభాస్ హనుతో పాటు మీడియం, చిన్న సినిమాలు కలిపి పాతిక, ముప్పై సినిమాలకు పైగా సినిమాలు షూటింగ్స్ చేస్తున్నాయి. ఇప్పుడు బంద్ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచాయి. ఒక రోజు షూటింగ్ ఆగిపోతే నిర్మాతకు చాలా నష్టం. ఆర్టిస్టుల డేట్స్ మళ్ళి దొరకవు, కాంబినేషన్స్ సెట్ కావు, సెట్ అయ్యే వరకు ఎదురు చూడాలి ఇక ఒకటేమిటి నిర్మాతకు చెప్పలేని కష్టాలు. అసలే నిర్మాణ భారం పెరిగి ఆదాయం తగ్గిపోయి నిర్మాతలు కుదేలవుతున్నారు. ఇప్పుడు ఈ బంద్ నిర్మాతలకు మరో భారం. ఫెడరేషన్ కు ఫిల్మ్ ఛాంబర్ కు మధ్య నెలకొన్న ఈ సమస్యకు ఈ రోజు జరగబోయే మీటింగ్ లో పరిస్కారం వస్తుందేమో చూడాలి.

Exit mobile version