Mouli: ఫ్యూచర్ ప్రాజెక్టులపై యంగ్ హీరో బోల్డ్ కామెంట్స్!

Mouli

Mouli

Mouli: యూట్యూబ్‌లో తన వీడియోలతో మంచి గుర్తింపు తెచ్చుకుని, లిటిల్ హార్ట్స్ సినిమాతో మొదటి ప్రయత్నంలో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో మౌళి తన రాబోయే ప్రాజెక్టులపై చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారాయి. సాధారణంగా ఇండస్ట్రీకి వచ్చే యంగ్ యాక్టర్స్ మాస్ హీరో అవ్వాలనో, పక్కా కమర్షియల్ బొమ్మ పడాలనో గట్టిగా ప్లాన్ చేసుకుంటారు. కానీ మౌళి మాత్రం భవిష్యత్తులో ఫలానా తరహా సినిమాలే చేయాలనే ఆలోచన తనకి అస్సలు లేదని తేల్చి చెప్పారు. తాజాగా నిర్వహించిన మౌళి కొత్త సినిమా ‘దొంగ నా కొడుకు’ ప్రమోషన్స్‌లో ఆయన తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి, అందులో పక్కా కమర్షియల్ యాక్షన్ సినిమాల గురించి మాట్లాడారు.

అందరికీ నచ్చేదే కమర్షియల్ సినిమా అని, అసలు ఫలానా జోనర్ మాత్రమే చేయాలన్న ఆలోచన తన మైండ్‌లో ఎప్పుడూ ఉండదని ఈ సందర్భంగా మౌళి స్పష్టం చేశారు. కథలు వినేటప్పుడు తాను ఎప్పుడూ ఓపెన్-మైండ్‌తో ఉంటానని ఆయన చెప్పుకొచ్చారు. “మనం ముందే ఏదో ఒకటి ఫిక్స్ అయిపోయి, అలాంటి కథలే వెతుక్కుంటూ వెళ్తే.. ఆ పరిధిలోనే ఆలోచిస్తాం. దానివల్ల మంచి కథలు మిస్సయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే కథ ఏదైనా సరే, వింటున్నప్పుడు ఇంట్రెస్టింగ్‌గా ఉండి, చూసేవాళ్లకు బోర్ కొట్టకుండా ఉంటే చాలు. కామెడీ, డ్రామా, ఎమోషన్ లేక భారీ కమర్షియల్ సినిమా అయినా చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు” అని అన్నారు. కథ బాగుంటే చాలు ఏ జోనర్ అయినా చేస్తానంటూ మౌళి చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.