Site icon NTV Telugu

Demand Heroines In South : మోస్ట్ డిమాండబుల్ సౌత్ హీరోయిన్స్ వీళ్ళే

Tollywood

Tollywood

డ్రాగన్‌ మూవీ బ్లాక్ బస్టర్ అవడంతో యూత్ హార్ట్‌ థ్రోబ్‌గా మారింది కయాద్ లోహార్. అప్పటి వరకు కయాద్ అందం, టాలెంట్ పట్టించుకోని మేకర్స్ .. ఆమె డేట్స్ కోసం ఎదురు చూసేంత బిజీగా మారింది. ప్రజెంట్ టాలీవుడ్ , కోలీవుడ్, మాలీవుడ్ అని తేడా లేకుండా సినిమాలకు సైన్ చేస్తూ.. మునుపెన్నడూ లేనంత బిజీగా మారిపోయింది మిస్ అస్సామీ. ఆమె ఖాతాలో ఏకంగా ఏడు సినిమాలున్నాయి. తెలుగు రీ ఎంట్రీ ఫంకీలో తడబడినా.. ఆమె ఖాతాలో ప్యారడైజ్ రూపంలో మరో బిగ్ ఆపర్చునిటీ తగిలింది. ఇందులో సుబ్బు క్యారెక్టర్ చేస్తోంది కయాద్.

Also Read : Akkineni : అక్కినేని ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. నాగచైతన్య లైనప్‌లో ప్రాజెక్టులు!

ప్రేమలుతో పాపులారిటీ సంపాదించిన మమితా బైజుకు ఓన్ ఇండస్ట్రీ కన్నా తమిళ మేకర్స్ రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. డ్యూడ్ సక్సెస్ కూడా ఇందుకు దోహద పడుతోంది. వరుసగా స్టార్ హీరోలతో నటిస్తోంది మమిత. జననాయగన్‌లో విజయ్, విశ్వనాథ్ అండ్ సన్స్‌లో సూర్య, కరలో ధనుష్, విష్ణు విశాల్ ఇరండు వానం చేస్తోంది క్యూటీ. తెలుగులో ఒక్క సినిమాకు సైన్ చేసిన దాఖలాలు లేవు కానీ.. మేడమ్ రెమ్యునరేషన్ కోటి దాటిపోయిందని సమాచారం. కన్నడ కస్తూరీ రుక్మిణీ వసంత్.. ఓన్ ఇండస్ట్రీలో తప్ప మరోచోట సక్సెస్ కావడం కష్టం. కానీ పాన్ ఇండియా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అంటే అమ్మడి పేరే ఫస్ట్ వినిపిస్తోంది. టాక్సిక్, డ్రాగన్ లాంటి బిగ్ స్కేల్ చిత్రాల్లో నటిస్తోన్న కాంతార బ్యూటీ.. కోలీవుడ్‌లో ధనుష్ మూవీకి కమిటైందని టాక్. ఈ లైనప్, ఈ క్రేజీ చూస్తుంటే.. ఫ్యూచర్‌లో ఈ భామలే సౌత్ క్వీన్స్‌గా మారతారేమో.

Exit mobile version