Mollywood : డ్రగ్స్ దుమారంపై.. మలయాళ పరిశ్రమ కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాదకద్రవ్యాల వాడకం ఆరోపణలతో.. గత కొంతకాలంగా మలయాళ చిత్ర పరిశ్రమ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. పేరు పొందిన నటులు సైతం షూటింగ్ సెట్స్ లో డ్రగ్స్ తీసుకుంటున్నారని పలువురు నటీమణులు ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే మాదక ద్రవ్యాల వాడకాన్ని నియంత్రించేందుకు మలయాళ చిత్ర పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read : Kubera : ‘కుబేర’ తో ఎన్నాళ్లకు హౌస్‌ఫుల్ బోర్డులు.. మళ్లీ జోష్‌లో ఇండస్ట్రీ
Also Read
నటీనటులు ఎవరైనా ప్రాజెక్టు ఓకే చెప్పినప్పుడు వారు తప్పకుండా సెట్‌ల్లో డ్రగ్స్ ఉపయోగించము అనే ఒక కొత్త అఫిడవిట్ పై సంతకం చేయాల్సి ఉంటుంది. నటీనటులతో పాటు వారి సిబ్బంది.. చివరకు డ్రైవర్ కూడా ఇందులో భాగమే. వారందరూ సంతకాలు చేస్తేనే సెట్ లోకి అడుగు పెట్టగలుగుతారు. ఈ మేరకు మలయాళ చిత్ర నిర్మాతల అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. షూటింగ్ లొకేషన్ తో పాటు నిర్మాణాంతర పనులు జరిగే ప్రదేశాల్లోనూ ఇది వర్తిస్తుంది. సూపర్ స్టార్స్ నుంచి చిన్నస్థాయి టెక్నీషియన్స్ వరకు ఎవరూ దీనికి అతీతులు కారు. నిర్మాతల అసోసియేషన్ తీసుకున్న ఈ నిర్ణయం పై అన్ని విభాగాల వారు ఆమోదం తెలిపినట్లు సమాచారం. మరోవైపు, ఆదివారం ‘అమ్మ’ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో దీని గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
-
Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
-
Jim Jim Tara: జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్ రిలీజ్ చేసిన పర్ణశాల టీం
-
Aafiya Sayed: రుక్మిణి ఎవరో తెలిసింది.. నితిన్ లవర్‌గా సరికొత్త హీరోయిన్
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!