Thudakkam OTT Release: విస్మయ మోహన్‌లాల్ తొలి సినిమా ఓటీటీలోకి.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thudakkam OTT Release: మోహన్‌లాల్ కుమార్తెగా మాత్రమే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే లక్ష్యంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన విస్మయ మోహన్‌లాల్‌కు ‘తుడక్కం’ తో ప్రేక్షకులను పలకరించింది. మార్షల్ ఆర్ట్స్, సర్వైవల్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 7న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను మెప్పించింది కూడా. ఇప్పుడు థియేట్రికల్ రన్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. విస్మయ తొలి సినిమాను థియేటర్లలో మిస్ అయిన వారు, మరోసారి చూడాలనుకునే వారు ఎక్కడ, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకోవానుకుంటున్నారా ? అయితే వాటి వివరాలుపై ఓ లుక్ వేద్దాం పదండి.
జియోహాట్‌స్టార్ (JioHotstar)లో స్ట్రీమింగ్
‘తుడక్కం’ (Thudakkam) 2026లో విడుదలైన ఒక మలయాళ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కుమార్తె విస్మయ మోహన్‌లాల్ ఈ సినిమాతోనే నటిగా వెండితెరకు పరిచయమవ్వడం విశేషం. జాతీయ అవార్డు గ్రహీత జుడ్ ఆంథోనీ జోసెఫ్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోనీ పెరుంబవూర్ నిర్మించిన ఈ సినిమా 2026 ఆగస్టు 7న థియేటర్లలో విడుదలైంది. థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత, ఈ మూవీ 2026 సెప్టెంబర్ 18 నుండి ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ (JioHotstar) లో డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది.
Also Read
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్‌పై సస్పెన్స్.. అసలు ఏం జరుగుతోంది?
- Bigg Boss Telugu 10: ఇక బిగ్ బాస్ సందడే.. ఈరోజు నుంచి షో స్టార్ట్.. కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే!
- Tortoise: ప్రతి 25 నిమిషాలకూ ఓ బాంబ్ లాంటి ట్విస్ట్.. డైరెక్టర్ ఓపెన్ ఛాలెంజ్!
- R. Narayana Murthy: 'కామ్రేడ్' పదం వాడితే అభ్యంతరమా? సెన్సార్ బోర్డుపై ఆర్.నారాయణమూర్తి ఫైర్
థియేటర్లలో విడుదలైన దాదాపు ఆరు వారాల తర్వాత ఈ మార్షల్ ఆర్ట్స్ థ్రిల్లర్ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. థియేటర్లలో సినిమాను చూడలేకపోయిన వారికి ఇది మంచి అవకాశం. ఈ సినిమాలో విస్మయ లీడ్ రోల్ లో నటించగా, మోహన్‌లాల్ కూడా ఇందులో అతిథి పాత్రలో కనిపించారు. సాయి కుమార్, బాబీ కురియన్, మనోజ్ కె. జయన్, కేబీ గణేష్ కుమార్, చిప్పీ రంజిత్, కొట్టాయం రమేష్, జయ కురుప్, జాఫర్ ఇడుక్కి, టీజీ రవి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.
స్టోరీ
ఈ కథ మీను (విస్మయ మోహన్‌లాల్) అనే ఒక డేరింగ్ యువతి చుట్టూ తిరుగుతుంది. ఆమె ఒకవైపు బ్యాంక్ ఉద్యోగం కోసం పరీక్షలకు సిద్ధమవుతూనే, మరోవైపు తన మార్షల్ ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్లో పిల్లలకు శిక్షణ ఇస్తూ ఉంటుంది. ఒక కొండ ప్రాంతంలో వికలాంగుడైన తన తండ్రి రవి (సాయి కుమార్) తో కలిసి ఆమె ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంటుంది. మీనుకు చిన్నప్పటి నుండి మార్షల్ ఆర్ట్స్‌లో ఓనమాలు నేర్పించి, ఆమెను ఒక యోధురాలిగా తీర్చిదిద్దింది ఆమె గురువు (మోహన్‌లాల్). ఒకరోజు సాయంత్రం మీను ఒంటరిగా ఇంటికి వెళ్తుండగా, దారిలో ఇద్దరు స్కూల్ చదువుకునే ఆడపిల్లలు ఇబ్బందుల్లో ఉండటం గమనిస్తుంది. ఆమె ఆ పిల్లలను సురక్షితంగా వారి ఇంటికి చేరుస్తుంది.
అయితే ఆ సమయంలోనే ఆమె ఒక క్రూరమైన క్రిమినల్ స్టాకర్ (ఆశిష్ జో ఆంటోనీ) కంటపడుతుంది. ఆ పిల్లలను కాపాడే క్రమంలో మీను చేసిన పని ఆ క్రిమినల్‌కు కోపం తెప్పిస్తుంది. దాంతో అతను మీనును మానసికంగా వేధించడం, ఆమె ఎక్కడికి వెళ్లినా నీడలా వెంబడించడం మొదలుపెడతాడు. మొదట్లో చిన్న వేధింపులుగా అనిపించినప్పటికీ, రోజురోజుకూ ఆ క్రిమినల్ సైకో ఉన్మాదం ఎక్కువవుతుంది. ఒక రాత్రి అతను ఏకంగా మీను ఇంటిపైనే దాడి చేసి, ఆమె తండ్రి ప్రాణాలను ప్రమాదంలో పడేస్తాడు. బయటి ప్రపంచం నుండి ఎలాంటి సహాయం ఆశించే అవకాశం లేని ఆ మారుమూల కొండ ప్రాంతంలో, మీను తన తండ్రిని, తనను తాను రక్షించుకోవడానికి ఆ క్రూరమైన శత్రువును ఒంటరిగా ఎలా ఎదిరించింది అనేదే ఈ సినిమా క్లైమాక్స్.
తాజావార్తలు
-
Thudakkam OTT Release: విస్మయ మోహన్‌లాల్ తొలి సినిమా ఓటీటీలోకి.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
-
OnePlus Ace 7 Pro: 200MP కెమెరా, 16GB RAMతో వన్‌ప్లస్ Ace 7 Pro.. ఫీచర్లు లీక్!
-
Maruti Baleno Facelift 2026: కొత్త మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ విడుదల.. 1.2L Z-Series ఇంజన్, Level-2 ADAS
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, పండగే ఇవాళ!
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్‌పై సస్పెన్స్.. అసలు ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!