Site icon NTV Telugu

Monster Movie Banned Gulf Countries: గల్ఫ్ లో మోహన్ లాల్ సినిమాపై బ్యాన్

Mohanlal

Mohanlal

Mohanlal monster movie banned gulf countries: మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ నటించిన ‘మాన్ స్టర్’ సినిమా దీపావళి కానుకగా ఈ నెల 21న విడుదల కానుంది. వైశాఖ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఉదయ్‌కృష్ణ రచయిత. ఇదిలా ఉంటే ఈ సినిమాని గల్ఫ్ దేశాల్లో నిషేదించారు. ఎల్‌జీబీటీక్యూ సీన్స్ ఉండటం వల్లే ఈ సినిమాను నిషేదించినట్లు వినిపిస్తోంది.

Read also: Munugode By Poll: మునుగోడు కాదు మణిగోలు.. నిన్న కోటి.. నేడు19..!

లెబ్సియన్, గే, బై సెక్చువల్, ట్రాన్సె జెండర్ అండ్ క్వొచ్చెనింగ్ వంటి సన్నివేశాల రీ సెన్సార్‌షిప్ కోసం నిర్మాతలు మళ్లీ దరఖాస్తు చేసినట్లు సమాచారం. దీని వల్ల గల్ఫ్ దేశాల్లో ‘మాన్ స్టర్’ చిత్రం మరి కొన్ని రోజుల తర్వాత విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో లక్ష్మీ మంచు, లీనా, హనీ రోజ్, సుదేవ్ నాయర్, సిద్ధిక్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఆశీర్వాద్ సినిమాస్ నిర్మించిన ఈ చిత్రానికి దీపక్ దేవ్ సంగీతం అందించారు.
Nagpur Panchayat Elections : నాగపూర్ జిల్లాలో బీజేపీకి షాక్.. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి

Exit mobile version