NTV Telugu Site icon

Mitraaw Sharma: బ్యాంకాక్ పారిపోయిన హర్షసాయి.. మిత్రాశర్మ సంచలనం!

Harsha Sai

Harsha Sai

ఒకప్పుడు యూట్యూబర్ హర్ష సాయి చేసిన సహాయం గురించి ఎక్కువగా వినిపించేది. కానీ ఇప్పుడు అతనికి సంబంధించిన రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అతను బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేస్తూ.. కోట్లు సంపాదిస్తున్నాడని.. ప్రత్యక్షంగానూ పరోక్షంగానే అనేక మంది బెట్టింగ్ యాప్‌ల బారిన పడి ప్రాణాలు కోల్పోవడానికి కారణం అయ్యాడనే విమర్శలు వినిపించాయి. ఆ తరువాత హర్షసాయి పెళ్లి పేరుతో తనని మోసం చేశాడని మిత్రా శర్మ హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అడ్వకేట్‌తో స్టేషన్‌కి వెళ్లి.. ఆధారాలను సమర్పించి తన వద్ద రూ.2 కోట్లు తీసుకుని పెళ్లి పేరుతో మోసం చేశాడని ఫిర్యాదు చేయడంతో అతనిపై రేప్ కేసుని నమోదు చేసి దర్యాప్తు చేశారు పోలీసులు.

L2E Empuraan: దిల్ రాజు చేతుల మీదుగా తెలుగు రాష్ట్రాల్లో ‘L2E ఎంపురాన్’

ఆ సంగతి ఏమైందో తెలియదు కానీ ఇన్నాళ్లకు ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించింది. తాజాగా హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని అతని మీద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో మిత్రా హర్ష సాయి పేరు ప్రస్తావించకుండా హలో మిస్టర్ చీటర్, మళ్ళీ బ్యాంకాక్ పారిపోయావ్ అంట కదా, నువ్ మమ్మల్ని మోసం చేసి మా జీవితాలు నాశనం చేసావ్, ఇప్పుడు నిన్ను కర్మ వెంటాడుతోంది. కనీసం ఇప్పటికైనా నా మాట విని మారు, సొసైటీకి, నీ ఫాలోవర్స్ కి సారీ చెప్పు. ఇక మీదట బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేయనని చెప్పు, ఈరోజు బ్యాంకాక్ నుంచి బయలుదేరు. సజ్జనార్ గారు, మీవల్ల చాలా కుటుంబాల ఫ్యూచర్ బాగుంటుంది అంటూ ఆమె పేర్కొంది.