Ms India : మిసెస్ ఇండియా’ పోటీలో సత్తా చాటిన తెలంగాణ వనిత సుష్మా
- మిసెస్ ఇండియా పోటీల్లో సత్తా చాటిన సుష్మా
- భారతదేశంలో యూఎంబీ ప్యాజెంట్ అందాల పోటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిసెస్ ఇండియా మై ఐడెంటిటీకి జరిగిన పోటీల్లో గతంలోనే సత్తా చాటారు సుష్మా తోడేటి. పెళ్లి అయ్యాక మహిళల జీవితం వంటింటికే పరిమితం కాదని, పెళ్లైనా, సంసార జీవితాన్ని సాగిస్తూ ఎన్నో శిఖరాలను అధిరోహించొచ్చని ఎంతో మంది నిరూపిస్తున్నారు. అలాంటి ధీర వనితల్లో సుష్మా తోడేటి ఒకరు. మిసెస్ ఇండియా పోటీల్లో తెలంగాణ నుంచి పాల్గొని మన ఆచార, సంప్రదాయాలను చాటి చెప్పారు. గతంలో జరిగిన మిసెస్ ఇండియా మై ఐడెంటిటీ పోటీల్లో సుష్మా తోడేటి పలు కేటగిరీల్లో అవార్డులు సాధించారు. బెస్ట్ కల్చర్ డ్రెస్, మిసెస్ వెల్ స్పోకెన్, సోషల్ ఇన్‌స్టిట్యూట్ వంటి కేటగిరీల్లో టాప్‌లో నిలిచారు సుష్మా. రీసెంట్‌గా యూఎంబీ ప్యాజెంట్ మిసెస్ ఇండియా పోటీలు జరిగాయి. ఇందులోనూ సుష్మా తోడేటి తన సత్తా చాటారు. థర్డ్ రన్నరప్‌గా నిలిచారు.
Also Read : Tollywood : ఘనంగా ప్రారంభమైన ‘మహా సంద్రం’
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
కుటుంబమే తన బలం తన భర్త శ్రీనాథ్ వెన్నంటి ప్రోత్సహించడం వల్లే ఈ స్థాయిలో రాణించగలుగుతున్నానని అన్నారు సుష్మా తోడేటి. ప్రపంచ వేదికలపై తెలంగాణ సంస్కృతిని పరిచయం చేయడం చెప్పలేని అనుభూతిని కల్గిస్తుందని అన్నారు. తెలంగాణ చేనేతను ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నానని సుష్మా తోడేటి చెబుతున్నారు. భారతదేశంలో యూఎంబీ ప్యాజెంట్ అందాల పోటీకి ఉండే క్రేజ్ అందరికీ తెలిసిన విషయమే. ఈ సారి వివిధ రాష్ట్రాల నుంచి స్పూర్తిదాయకమైన 70 మంది పోటీదారులను స్వాగతించారు. నాలుగు సంవత్సరాల క్రితం ఉర్మి, స్నిగ్ధా బారుహ్ స్థాపించిన UMB ప్యాజెంట్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ పొందింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటీనటులు సారా అలీ ఖాన్, అర్జున్ కపూర్, మానుషి చిల్లర్, భూమి పెడ్నేకర్, నేహా ధూపియా, కరిష్మా కపూర్, మలైకా అరోరా ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
తాజావార్తలు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!