‘హనుమాన్’ మూవీతో తేజ సజ్జా మార్కెట్ ఎలా పెరిగిందో తెలిసిందే. ఒక్కసారిగా పాన్ ఇండియా హీరో అయ్యాడు. తెలుగు సూపర్ హీరోగా మారిపోయాడు. దీంతో తన తదుపరి ప్రాజెక్ట్‌లు ఆచితూచి ఎంచుకుంటూ వస్తున్న తేజ, ప్రస్తుతం ‘మిరాయ్’ అనే చిత్రంలో ఫుల్ బిజీగా ఉన్నాడు. సూపర్ యోధ పాత్ర కోసం మరోసారి కంప్లీట్‌గా మేకోవర్ అయ్యారు తేజ. మనోజ్ మంచు విలన్‌గా, రీతికా నాయక్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, స్పెషల్ గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఇక తాజాగా ఇప్పుడు మూవీ టీం నుంచి అప్డేట్ అయితే వచ్చింది.
Also Read : Vijay : ‘96’ మూవీ సీక్వెల్ నుంచి విజయ్ సేతుపతి ఔట్..
మే 28న టీజర్ రాబోతున్నట్లు ప్రకటించారు. మిరాయ్ టీజర్ వచ్చిన తర్వాత లెక్క వేరేలా ఉంటుందని టీం హైప్ పెంచేస్తోంది. కాగా ఈ ప్రకటనలో భాగంగా ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో తేజ రన్నింగ్ ట్రైన్ పై వెళ్తు కనిపించాడు. ఇక వీరికి తగ్గట్టుగా రానా కూడా మిరాయ్ మీద అంచనాలు పెంచే పనిలో పడ్డారు. కాగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో, 2డీ, 3డీ ఫార్మాట్లలో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు.