ఈగల్ సినిమా ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మిరాయ్ అనే సినిమా చేసాడు యంగ్ హీరో తేజ సజ్జా. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న పాన్ ఇండియా భాషలలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది. తేజ సూపర్ యోధగా మంచు మనోజ్ యాంటోగనిస్టుగా అదరగొట్టారు. అందుకు తగ్గట్టే కలెక్షన్స్ లో మిరాయ్ దూసుకెళ్తోంది.
Also Read : Janhvi Kapoor : వారం గ్యాప్ లో రెండు సినిమాలను దించుతున్న జాన్వీ
భారీ హైప్ తో రిలీజ్ అయిన మిరాయ్ మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ. 27.20 కోట్లు గ్రాస్ రాబట్టి సూపర్ స్టార్ట్ అందుకుంది. రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రల్లో టైర్ 2 హీరోల సినిమాల కంటే ఎక్కువ వసూళ్లు చేసి ఆల్ టైమ్ రికార్డ్ నమోదు చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా శని, ఆదివారం వీకెండ్ దానికి తోడు బ్లాక్ బస్టర్ మౌత్ టాక్ తో ఎక్కడ చుసిన హౌస్ ఫుల్ బోర్డ్స్ పెట్టింది. రిలీజ్ అయిన తొలి మూడు రోజులకు గాను వరల్డ్ వైడ్ గా రూ. 81.2 కోట్లు గ్రాస్ రాబట్టి సెన్సేషనల్ క్రియేట్ చేసింది. ఓవర్సీస్ లోను మిరాయ్ దుమ్ములేపుతోంది. కేవలం నార్త్ అమెరికాలో $10.7 మిలియన్ వసూళ్లు చేసి 2 మిలియన్ కు దూసుకెళ్తోంది. లాంగ్ రన్ లో 3 మిలియన్ డాలర్స్ వసూలు చేస్తుందని ట్రేడ్ అంచానా వేస్తుంది. తెలుగు స్టేట్స్ లోను బ్రేక్ ఈవెన్ దాటి లాభాల బాటలో పయనిస్తున్న మిరాయ్ ఫైనల్ రన్ లో బయ్యర్స్ కు నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టనుంది.