Site icon NTV Telugu

Teja Sajja: మిరాయ్ అంటే మీనింగ్ ఇదే? జపాన్, చైనాలో కూడా అందుకే రిలీజ్!

Mirai

Mirai

సూపర్ హీరో తేజ సజ్జా పాన్-ఇండియా సూపర్ హీరో విజువల్ వండర్ ‘మిరాయ్‌’లో సూపర్ యోధ పాత్రలో అలరించబోతున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ట్రైలర్ మ్యాసీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. సెప్టెంబర్ 12న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహించారు. చెన్నై ప్రెస్ మీట్ లో సూపర్ హీరో తేజ సజ్జా మాట్లాడుతూ మిరాయ్ యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ డివోషన్ ఎమోషన్ ఎలివేషన్ అన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమా.

Also Read:Peddi: త్వరలో ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్.. రెహ్మాన్తో చరణ్ స్పెషల్ పిక్

ఖచ్చితంగా థియేటర్స్ లోనే చూసే సినిమాలు ఒక ఏడాదిలో చాలా తక్కువగా వస్తుంటాయి. మిరాయి అందరూ థియేటర్స్ లో చూడాల్సిన సినిమా. ఫ్యామిలీతో కలిసి థియేటర్స్ లో ఎంజాయ్ చేసే సినిమా. పిల్లలకు పెద్దలకు అందరికీ నచ్చే సినిమా. మిరాయ్ అంటే హోప్ ఫర్ ఫ్యూచర్ అని మీనింగ్. దీనికి మరో అర్థం కూడా ఉంది. అది మీరు సినిమాలో చూస్తున్నప్పుడు కచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు. ఈ సినిమాని జపాన్, చైనీస్ లో కూడా రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే మన ఇండియన్ సినిమాకి జపాన్ చైనీస్ లో చాలా మంచి మార్కెట్ ఉంది. హనుమాన్ కూడా చైనా జపాన్లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా కూడా అక్కడ ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకం ఉంది.

Exit mobile version