Site icon NTV Telugu

Mirai: అంబికగా శ్రియ శరణ్‌ స్పెషల్ పోస్టర్ రిలీజ్

Shreya

Shreya

తేజ సజ్జా నటించిన పాన్-ఇండియా సూపర్ హీరో చిత్రం ‘మిరాయ్’ సెప్టెంబర్ 12, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ మరియు కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే తన గ్లింప్స్, టీజర్, మరియు ట్రైలర్‌లతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తించింది. ‘మిరాయ్’లో తేజ సజ్జా సూపర్ యోధ పాత్రలో అలరించనున్నారు. తేజ సజ్జా సరసన రితికా నాయక్ కథానాయికగా నటిస్తుండగా, సీనియర్ నటులు జయరామ్ మరియు జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Also Read:Nagini Dance: వీడు కేక.. నాగినికే నాగిని డాన్స్ నేర్పాడు.

ఈ చిత్రంలో ప్రముఖ నటి శ్రియ శరణ్ ‘అంబిక’ అనే కీలక పాత్రలో నటిస్తున్నారు. మేకర్స్ ఇటీవల శ్రియ పాత్రను పరిచయం చేస్తూ ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ శ్రియ శరణ్‌ను ఒక శక్తివంతమైన తల్లి పాత్రలో చూపిస్తూ, సూపర్ హీరో ప్రయాణం వెనుక ఉన్న భావోద్వేగ కోణాన్ని హైలైట్ చేసింది. శ్రియ పాత్ర ఈ చిత్రంలో స్ట్రాంగ్ ఎమోషనల్ డెప్త్‌ను జోడించనుందని మేకర్స్ తెలిపారు. ‘మిరాయ్’ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించడమే కాకుండా, సినిమాటోగ్రఫీ మరియు స్క్రీన్‌ప్లే బాధ్యతలను కూడా స్వయంగా నిర్వహించారు. ‘మిరాయ్’ చిత్రం గ్లింప్స్, టీజర్, మరియు ట్రైలర్‌లు ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ బజ్‌ను సృష్టించాయి. ఈ ప్రమోషనల్ కంటెంట్‌లో చూపించిన విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు, మరియు భావోద్వేగ క్షణాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సూపర్ హీరో జానర్‌లో కొత్త ఒరవడిని సృష్టించేందుకు ఈ చిత్రం సిద్ధంగా ఉందని ట్రైలర్ సూచిస్తోంది.

Exit mobile version