NTV Telugu Site icon

Talasani srinivas yadav: ఇదంతా రాజ‌మౌళి వల్లే.. త్వరలో RRR టీమ్‌ను..

Talasani Rajamouli

Talasani Rajamouli

Talasani srinivas yadav: రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్త ఆదరణను తెచ్చిపెట్టిందని అన్నారు. అంతేకాదు.. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం తరుపున RRR బృందానికి సన్మానం చేయాలని నిర్ణయించామ‌ని తెలిపారు. మాసాబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ , FDC చైర్మన్ అనిల్ కూర్మాచలంతో కలిసి మాట్లాడారు. RRR చిత్రానికి ఆస్కార్ అవార్డ్ లభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి త‌ల‌సాని, FDC చైర్మన్ అనిల్, FDC ED కిశోర్ బాబు క‌లిసి జర్నలిస్టులకు స్వీట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ఆస్కార్‌ అవార్డు అందుకున్న ఏకైక తెలుగు సినిమాగా ఆర్‌ఆర్‌ఆర్‌ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం తెలుగు రాష్ట్రాలు, దేశం గర్వించేలా ఉందన్నారు. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డును గెలుచుకున్న గొప్ప చిత్రం. దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, పాటల రచయిత చంద్రబోస్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మరియు సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం తరపున అభినందించారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొదటి నుంచి దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తోందని మంత్రి విమర్శించారు. ఆస్కార్ అవార్డులకు ఎంట్రీ పంపండి అంటే ఆస్కార్ ఎంట్రీ కోసం గుజరాత్ రాష్ట్ర సినిమా చేలో షో అంటూ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆరోపించింది. కానీ వారికి గుణపాఠంగా RRR చిత్రం ఆస్కార్‌కు నామినేట్ అయింది. రాజమౌళి కృషి వల్లే ఆస్కార్ అవార్డు వచ్చిందని చిత్ర దర్శకులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం చేపట్టిన చర్యలతో సినీ పరిశ్రమకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్ గా నిలిచిందన్నారు. సినీ పరిశ్రమకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని, పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు.

Show comments