ఇటీవల ఫిలిం చామ్బర్ లో జరిగిన ఎన్నికల్లో భారత్ భూషణ్ ప్రత్యర్థి ఠాగూర్ మధుపై 12 ఓట్ల తేడాతో గెలుపొందారు, అలాగే ఉపాధ్యక్షునిగా అశోక్ కుమార్ 10 ఓట్ల తేడాతో వైవియస్ చౌదరిపై గెలుపొందిన సంగతి తెలిసిన విషయమే. కాగా నేడు తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనందున భరత్ భూషణ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పుష్పగుచ్చం అందించి తెలుగు సినీ ఇండస్ట్రీ సమస్యలు మరియు గద్దర్ అవార్డ్స్ గురించి చర్చించారు.
ఈ సందర్భంగా తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు భరత్ భూషణ్ గారు మాట్లాడుతూ “పలు అభివృద్ధి, రాజకీయ కార్యక్రమాలతో ఎంతో బిజీ షెడ్యూల్ ఉండి కూడా ఫిలిం ఛాంబర్ సభ్యులను కలవడానికి అవకాశం ఇచ్చి ముచ్చటించి, మా సమస్యలు విన్నందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇండస్ట్రీలో ఉన్న సమస్యల్ని పరిష్కరించడంలో ప్రభుత్వం నుంచి ఎప్పుడు సహాయం అందుతుందని సీఎం చెప్పడం చాలా ఆనందంగా ఉంది” అని అన్నారు.
Also Read: Ashwin Babu: నేడే విడుదల.. ఈ లోగా మరోటి స్టార్ట్ చేసిన అశ్విన్ బాబు
అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు భరత్ భూషణ్ గారికి, ఉపాధ్యక్షులు ఆశజూక్ కుమార్ కు నా అభినందనలు. పలు కారణాల రీత్యా నేను అమెరికా వెళ్తున్నాను. అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీతో మీటింగ్ ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వం తరపు నుండి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నాము” అని అన్నారు.