Megha Akash: పొలిటికల్ ఫ్యామిలీ కుర్రాడిని లవ్ మ్యారేజ్ చేసుకున్న హీరోయిన్.. ఎవరో తెలుసా?
- టాలీవుడ్ హీరోయిన్ మేఘా ఆకాష్ వివాహం
- మాజీ మంత్రి తిరునావుకరసర్ కుమారుడు సాయివిష్ణుతో వివాహం
- మేఘా ఆకాష్‌కి సోషల్ మీడియాలో అభినందనల వర్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Megha Akash Husband Vishnu Sai Background Details: టాలీవుడ్ హీరోయిన్ మేఘా ఆకాష్ రజనీకాంత్‌తో ‘పెట్టా’ సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో ఆమె ఒక సైడ్ రోల్ పోషించింది. తరువాత సంవత్సరం నటుడు ధనుష్ సరసన ఎనై నోకి పాయుమ్ తోటలో హీరోయిన్గా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత తమిళంలో విజయ్ సేతుపతి, శింబు వంటి ప్రముఖ నటుల సరసన నటించిన మేఘా ఆకాష్ తెలుగు, మలయాళ చిత్రాల్లోనూ నటించింది. అయితే ఇదిలా ఉండగా మాజీ మంత్రి తిరునావుకరసర్ కుమారుడు సాయివిష్ణుతో ఆమె ప్రేమలో పడింది. వీరు గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గత నెలలో చెన్నైలో సాయి విష్ణు, మేఘా ఆకాష్ నిశ్చితార్థం జరిగింది.
Jani Master: మతం మారాలని దాడి.. పార్శిల్ వార్నింగ్.. వెలుగులోకి సంచలనాలు!!!
Also Read
- NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
- Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
తర్వాత నిన్న చెన్నైలో మేఘా ఆకాష్-సాయివిష్ణు జంట వివాహ రిసెప్షన్ జరిగింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, మంత్రులు ఉదయనిధి స్టాలిన్, అన్బిల్ మహేష్, కేకేఎస్సార్ రామచంద్రన్ సహా పెద్ద సంఖ్యలో రాజకీయ నేతలు హాజరయ్యారు. ఆ తర్వాత మేఘా ఆకాష్ – సాయి విష్ణు జంట వివాహం కూడా నిన్న ఘనంగా జరిగింది. బంధువులు, స్నేహితులు మాత్రమే హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. సాయివిష్ణు తన ప్రేమించిన భార్యకు తాళి కట్టి ముద్దుపెట్టి తన ప్రేమను చాటుకున్నాడు. బాయ్‌ఫ్రెండ్‌తో ఏడడుగులు వేసిన నటి మేఘా ఆకాష్‌కి సోషల్ మీడియాలో అభినందనల వర్షం కురుస్తోంది. అలాగే ఆమె పెళ్లి ఫోటోలు కూడా విడుదలై ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తానని నటి మేఘా ఆకాష్ చెప్పడం గమనార్హం.
- Tags
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!