Chiranjeevi-Megaverse: ‘మెగావర్స్’లో స్టార్ హీరోల సందడి.. ప్రభాస్, పవన్, చరణ్.. లిస్ట్ ఇంకా పెద్దదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi Megaverse Guest List: ‘మెగాస్టార్’ చిరంజీవి మొదటిసారిగా ఓటీటీ వేదికపై హోస్ట్‌గా మారిన విషయం తెలిసిందే. సెలబ్రిటీ టాక్ షో ‘మెగావర్స్’కు ఆయన హోస్ట్‌గా వ్యవరిస్తున్నారు. ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో మెగావర్స్ త్వరలో ప్రసారం కానుంది. ఈ షోపై టాలీవుడ్లో రోజురోజుకూ అంచనాలు రెట్టింపవుతున్నాయి. షోలో టాలీవుడ్ అగ్ర తారలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు చిరు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తతం స్టార్ హీరోలతో ప్రత్యేక ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. టాలీవుడ్‌తో పాటు ఇతర భాషలకు చెందిన ప్రముఖ నటీనటులు ఈ కార్యక్రమంలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు స్టార్లతో ఎపిసోడ్స్‌కు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్స్‌ను సిద్ధం చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
నవంబర్ 22న ప్రభుదేవా, ప్రముఖ సంగీత దర్శకుడు థమన్‌తో కలిసి చిరంజీవి ప్రత్యేక ఎపిసోడ్ షూటింగ్లో పాల్గొననున్నట్లు సమాచారం. అనంతరం నవంబర్ 24 నుంచి రవితేజ, నానితో ఎపిసోడ్ చిత్రీకరణ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ కాంబినేషన్లు తెరపై ఎలా సందడి చేస్తాయోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తదుపరి షెడ్యూల్లో కోలీవుడ్ స్టార్స్ సూర్య, జ్యోతిక, కార్తీతో చిరంజీవి ఎపిసోడ్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ప్రత్యేక ఎపిసోడ్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.
Also Read
- HanuMan 2 : టాలీవుడ్లో బిగ్గెస్ట్ సర్ప్రైజ్.. తేజ సజ్జా కాదు 'హను-మాన్ 2'లోకి మెగా హీరో ఎంట్రీ?
- Mayukha : ఓటీటీలోకి వచ్చేసిన సైకలాజికల్ థ్రిల్లర్ 'మయూఖ'.. కానీ ఒక్క కండిషన్?
- Telugu Movie Piracy: టాలీవుడ్లో మళ్లీ పైరసీ కలకలం.. ఒకే వెబ్సైట్లో 4 కొత్త సినిమాలు లీక్..
- Rashmika: ‘ఒసేయ్ రాములమ్మ’ అనగానే భయమేసింది.. మ్యాచ్ చేయలేం కానీ..!
ఇక మెగావర్స్లో తదుపరి పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉన్నట్లు తెలుస్తోంది. చిరంజీవితో ఈ ఇద్దరు హీరోలు ఒకే వేదికపై కనిపిస్తే అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అయితే ఈ ఎపిసోడ్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, ప్రసార తేదీలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. స్టార్ హీరోలతో రూపొందుతున్న ఈ ప్రత్యేక ఎపిసోడ్స్‌పై టాలీవుడ్లో ఆసక్తి పెరుగుతోంది. ప్రభుదేవా నుంచి ప్రభాస్ వరకు, పవన్ కల్యాణ్ నుంచి రామ్ చరణ్ వరకు పలువురు ప్రముఖులు మెగావర్స్లో సందడి చేయనున్నారనే వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది.
తాజావార్తలు
-
Chiranjeevi-Megaverse: ‘మెగావర్స్’లో స్టార్ హీరోల సందడి.. ప్రభాస్, పవన్, చరణ్.. లిస్ట్ ఇంకా పెద్దదే!
-
HanuMan 2 : టాలీవుడ్లో బిగ్గెస్ట్ సర్ప్రైజ్.. తేజ సజ్జా కాదు ‘హను-మాన్ 2’లోకి మెగా హీరో ఎంట్రీ?
-
Mayukha : ఓటీటీలోకి వచ్చేసిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘మయూఖ’.. కానీ ఒక్క కండిషన్?
-
New York Accident: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి.. ఉద్యోగం సాధించిన వారానికే మృత్యుఒడికి..
-
Hero Splendor+ బైక్ ధరలు పెంపు.. అన్ని వేరియంట్లపై భారీగా పెరిగిన రేట్లు.. కొత్త ధరలు ఇవే!
ట్రెండింగ్
-
Ball Tampering Scandal: కమిన్స్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తే గుడ్‌బై చెబుతా?.. ఆసీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Gold Purity: హాల్‌మార్క్ గోల్డ్‌లోనూ కల్తీ.. యంత్రాలకు కూడా దొరకని విధంగా ‘రేడియం పౌడర్’ మిక్స్..
-
IND vs PAK: పాకిస్థాన్‌తో మ్యాచ్ మాకో లెక్కే కాదు.. టీమిండియా కెప్టెన్ హాట్ కామెంట్స్..!
-
World Television Day 2026: బ్లాక్ అండ్ వైట్ నుంచి స్మార్ట్ టీవీ వరకు.. ఆసక్తికర ప్రయాణం.!
-
World Hello Day 2026 : ఒక్క ‘హలో’తో ఇన్ని లాభాలా?.. నవంబర్ 21 ప్రత్యేకత ఇదే.!