Mega Podcast: చిరంజీవి జీవితంలోని అరుదైన అనుభవాలు.. త్వరలో ‘మెగా పోడ్కాస్ట్’లో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వెండితెరపైనే కాకుండా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కూడా తనదైన ముద్ర వేయడానికి మెగాస్టార్ సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఆయన తన జీవిత విశేషాలను పంచుకోవడానికి ‘మెగా పోడ్కాస్ట్’ (Mega Podcast) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రముఖ రచయిత, దర్శకుడు బి.వి.ఎస్. రవి (BVS Ravi) ఎక్స్‌క్లూజివ్‌గా వెల్లడించారు. ప్రముఖ వార్తా సంస్థ ‘ఎన్టీవీ’ (NTV) అందించిన ఈ బ్రేకింగ్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది.
ఇటీవలే దర్శకుడు పూరి జగన్నాథ్ ‘పూరి మ్యూజింగ్స్’ పాడ్‌కాస్ట్ ఆడియోలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన తరుణంలో.. ఇప్పుడు టాలీవుడ్ బాస్ చిరంజీవి కూడా పోడ్కాస్ట్ ప్రపంచంలోకి అడుగుపెడుతుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. చిరు 4 దశాబ్దాలకు పైగా సాగిన సినీ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు, ఎవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్.. అరుదైన అనుభవాలను ఈ పోడ్కాస్ట్ ద్వారా అభిమానులతో పంచుకోబోతున్నారు. ఈ క్రేజీ డిజిటల్ ప్రాజెక్ట్‌ను ప్రముఖ టాలెంటెడ్ రైటర్ బి.వి.ఎస్. రవి నేతృత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటిస్తూ..‘చిరంజీవి అనే వ్యక్తి ఈ తెలుగు చలనచిత్ర పరిశ్రమను, కోట్లాది మంది అభిమానుల హృదయాలను ఎలా రూల్ చేశారు?’ అనే సరికొత్త కోణంలో ఈ పోడ్కాస్ట్ సాగుతుంది. ఇందులో కేవలం సినిమా ముచ్చట్లే కాకుండా.. ఆయన వ్యక్తిగత జీవితంలోని అరుదైన అనుభవాలు, ఇప్పటివరకు ఎక్కడా పంచుకోని ఎన్నో ఆసక్తికరమైన రహస్యాలను మెగాస్టార్ తన స్వరాంతరంతో ప్రేక్షకులకు వివరించబోతున్నారు’ అని బి.వి.ఎస్. రవి స్పష్టం చేశారు.
Also Read
- Irumudi : 'ఇరుముడి' నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
- Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
- Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
- Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
సాధారణంగా చిరంజీవి మాటల్లో ఎంతో హుందాతనం, క్రమశిక్షణ, స్పూర్తిదాయకమైన విషయాలు ఉంటాయి. ఒక సాదాసీదా మధ్యతరగతి యువకుడిగా కెరీర్ ప్రారంభించి.. ‘మెగాస్టార్’ గా ఎదిగిన ఆయన లైఫ్ జర్నీ ప్రస్తుత జనరేషన్‌కు ఒక పెద్ద గైడ్‌లా ఉపయోగపడనుంది. పూరి జగన్నాథ్ తన పాడ్‌కాస్ట్‌లలో సమాజంపై బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తే.. చిరంజీవి మాత్రం తన జీవిత పాఠాలను, ఇండస్ట్రీ సీక్రెట్స్‌ను మోటివేషనల్ అండ్ ఎంటర్టైనింగ్ వే లో అందించబోతున్నారని తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి సంచలన నిర్ణయం.. త్వరలోనే 'మెగా పోడ్కాస్ట్'!
మెగాస్టార్ చిరంజీవి జీవితంలోని అరుదైన అనుభవాలు, ఎవరికీ తెలియని రహస్యాలను పంచుకునేలా సరికొత్త పోడ్కాస్ట్ డిజైన్ చేస్తున్నట్లు ప్రముఖ రచయిత బి.వి.ఎస్. రవి వెల్లడి.
‘చిరంజీవి అనే వ్యక్తి ఈ తెలుగు…
— NTV Breaking News (@NTVJustIn) May 23, 2026
తాజావార్తలు
-
INDIA Bloc Rally in Delhi: INDIA కూటమి ‘ఓట్ బచావో, దేశ్ బచావో’ మహా ర్యాలీ.. 4 వేల మంది పోలీసులు మోహరింపు
-
Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
-
Income Tax Raid: భూమిలో పాతిపెట్టిన డ్రమ్ముల్లో నోట్ల కట్టలు.. ఏకంగా రూ.3.20 కోట్ల క్యాష్!
-
AP Local Body Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల లైవ్ అప్డేట్స్.. ప్రారంభమైన పోలింగ్!
-
Petrol Export Duty Cut to Zero: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్ ఎగుమతి సుంకం రద్దు, డీజిల్‌పై భారీ పెంపు
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!