సినిమాలు మళ్లీ విడుదల అవ్వడం (రీ-రిలీజ్లు) ఇప్పుడు టాలీవుడ్లో ఒక కొత్త ట్రెండ్‌గా మారింది. అభిమానుల సందడి, బాక్సాఫీస్ వద్ద రికార్డులు.. ఇవన్నీ రీ-రిలీజ్‌లకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. అయితే, ఈ ట్రెండ్‌లో మెగాస్టార్ చిరంజీవి మాత్రం అనుకున్న స్థాయిలో సత్తా చాటలేకపోతున్నారు. ఎన్నో క్లాసిక్ హిట్స్ ఉన్నప్పటికీ, మెగాస్టార్ పాత సినిమాలు రీ-రిలీజ్ అయినప్పుడు బాక్సాఫీస్ వద్ద నిరాశనే మిగులుస్తున్నాయి. మెగాస్టార్ కెరీర్లో ‘గ్యాంగ్‌లీడర్’, ‘ఘరానా మొగుడు’, ‘కొదమ సింహం’ వంటి ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి. ఈ చిత్రాలను మళ్లీ థియేటర్లలో చూసే అవకాశం మెగా ఫ్యాన్స్‌కు లభించినా, కలెక్షన్ల పరంగా అవి పూర్తిగా చేతులెత్తేస్తున్నాయి. ‘కొదమ సింహం’ వంటి సినిమాలు కనీసం 30 లక్షలు కూడా కలెక్ట్ చేయలేకపోయాయి. ‘గ్యాంగ్‌లీడర్’, ‘ఘరానా మొగుడు’ రీ-రిలీజ్లు కూడా ఫ్లాప్‌గా నిలిచాయి.
Also Read:Putin India Visit: పుతిన్ బస చేస్తున్న ‘‘ప్రెసిడెన్షియల్ సూట్’’ ఒక రోజు ఖర్చు ఎంతో తెలుసా..?
మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి హీరోల సినిమాలు రీ-రిలీజ్ అయితే, లక్షల్లో, కోట్లలో వసూళ్లు సాధిస్తున్నాయి. కానీ, చిరంజీవి సినిమాలను మాత్రం మెగా ఫ్యాన్సే ఎందుకు పెద్దగా చూడడం లేదనే ప్రశ్న తలెత్తుతోంది. చిరంజీవి అభిమానుల సంఘాలు రీ-రిలీజ్ విషయంలో సరైన స్థాయిలో సందడిని, ప్రచారాన్ని క్రియేట్ చేయలేకపోతున్నాయా? మహేష్, పవన్ సినిమాలను 4K ఫార్మాట్లో అత్యుత్తమ నాణ్యతతో విడుదల చేస్తుండగా, చిరంజీవి సినిమాల పాత ప్రింట్స్ ఆ స్థాయిలో లేకపోవడం కూడా ఒక కారణంగా ఉండొచ్చు. తరచుగా చిరంజీవి పాత సినిమాలు వస్తుండటం వల్ల, అభిమానులకు ఉత్సాహం తగ్గిపోవడం జరిగిందా?
Also Read:Gulshan Devaiah: సమంత హీరోగా కాంతార విలన్
రీ-రిలీజ్ ట్రెండ్‌లో నెంబర్ వన్ ప్లేస్‌లో లేకపోయినా, అక్కినేని నాగార్జున నటించిన ‘శివ’ చిత్రం మాత్రం బాగానే పర్ఫార్మ్ చేసింది. ఈ సినిమా రీ-రిలీజ్లో 4 కోట్లు వరకు రాబట్టి సత్తా చాటింది. ఈ విజయం, సీనియర్ హీరోల సినిమాలకు కూడా ఆదరణ ఉంటుందని నిరూపించింది. రీ-రిలీజ్ రికార్డులు ఇప్పటివరకు ఎక్కువగా మహేష్ బాబు (‘పోకిరి’), పవన్ కళ్యాణ్ (‘ఖుషి’)లకే సొంతమయ్యాయి. ఇప్పుడు వెంకటేశ్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు.
రీ-రిలీజ్‌లలో సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ తరచుగా కనిపిస్తున్నారు. త్వరలో వెంకటేశ్, నాగార్జున కూడా ఈ రిలీజ్‌లకు అలవాటుపడుతున్నారు. అయితే, మెగాస్టార్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరో సత్తా చాటే ఒక రీ-రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిరంజీవి క్లాసిక్స్‌లో ఒకటైన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ లేదా ‘ఇంద్ర’ వంటి చిత్రాలు సరైన ప్రణాళికతో, మెరుగైన క్వాలిటీతో వస్తే.. రికార్డులు ఖాయమని మెగా ఫ్యాన్స్ విశ్వసిస్తున్నారు.