Mega158: ‘మెగా158’ టైటిల్‌పై హింట్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి?

Chiranjeevi, Mega158,

Chiranjeevi, Mega158,

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), బ్లాక్‌బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి (Bobby Kolli) కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ #Chiru158 పూజా కార్యక్రమాలను ముగించుకుని, తాజాగా అఫీషియల్‌గా షూటింగ్‌ను ప్రారంభించింది. రీసెంట్‌గా ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఎస్.ఎస్. థమన్ ఎంపికైనట్లు అధికారిక ప్రకటన రాగా.. తాజాగా చిత్ర యూనిట్ “స్పిరిట్ ఆఫ్ మెగా158” (Spirit of Mega158) పేరిట విడుదల చేసిన గ్లింప్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. కన్నడ చిత్రపరిశ్రమలో లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ అయిన కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) టాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తూ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. షూటింగ్ ప్రారంభోత్సవం సందర్భంగా చిత్రంలో వర్క్ చేయబోయే టాప్ టెక్నీషియన్లను పరిచయం చేస్తూ మేకర్స్ ఒక క్రేజీ వీడియోను వదిలారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి తన పాత రోజుల నాటి వింటేజ్ కామిక్ టైమింగ్‌తో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించారు.

అయితే వీడియో చివర్లో మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా అఫీషియల్ టైటిల్‌ను కెమెరా ముందే రివీల్ చేయబోతుండగా.. దర్శకుడు బాబీ పరుగెత్తుకుంటూ వచ్చి సడన్‌గా ఆయనను ఆపుతాడు. బాబీ తనను ఆపడంపై చిరంజీవి తనదైన శైలిలో నవ్వుతూ స్పందిస్తూ.. “ఈ బాబీ నన్ను ఆపలేడు.. సరైన సమయం చూసి నేనే ఈ సినిమా టైటిల్‌ను లీక్ చేస్తాను” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. గతంలో చిరంజీవి తన సినిమాల టైటిల్స్ లేదా స్టోరీ పాయింట్లను ప్రెస్ మీట్స్‌లో అనుకోకుండా లీక్ చేసి ‘లీక్ రాజా’గా అభిమానుల చేత పిలిపించుకున్నారు. ఇప్పుడు అదే పాయింట్‌ను దర్శకుడు బాబీ ప్రమోషన్స్‌ కోసం చాలా స్మార్ట్‌గా వాడుకోవడంతో మెగా అభిమానులు ఈ వీడియో చూసి ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ఈ మూవీలో మలయాళ స్టార్ బ్యూటీ, ‘మంజుమ్మెల్ బాయ్స్’ ఫేమ్ అనస్వర రాజన్ (Anaswara Rajan) ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.‘వాల్తేరు వీరయ్య’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత చిరు-బాబీ కాంబోలో వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్.. ఈ సరికొత్త వీడియోతో అప్పుడే అంచనాలను అకాశానికి తీసుకెళ్లింది.