మెగాస్టార్ చిరంజీవి మరియు బ్లాక్‌బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి (కొల్లి సురేష్) కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ #Chiru158. ‘వాల్తేరు వీరయ్య’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో మెగా అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కాగా మెగాస్టార్ చిరంజీవి తన 158వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ భారీ కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి సరికొత్త మేకోవర్‌తో, ఊహించని రేంజ్ డెడికేషన్‌తో వర్క్ చేస్తున్నారుఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించి మేకర్స్ రోజుకో సాలిడ్ అప్‌డేట్‌తో సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నారు.
నిన్ననే ఈ చిత్రానికి సంబంధించిన ప్రొడక్షన్ డిజైనర్ వివరాలను వెల్లడించిన చిత్ర యూనిట్.. తాజాగా ఈ మెగా ప్రాజెక్ట్‌కు మ్యూజిక్ అందించబోయే ఆ ‘టాప్ మ్యూజిక్ డైరెక్టర్’ ఎవరనేది అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ సినిమాకు టాలీవుడ్ మోస్ట్ బిజీయెస్ట్ అండ్ స్టార్ మ్యూజిక్ సెన్సేషన్, ‘ఓజీ’ (OG) ఫేమ్ ఎస్.ఎస్. థమన్ (SS Thaman) సంగీత దర్శకుడిగా ఎంపికైనట్లు మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. థమన్ రాకతో #Chiru158 ప్రాజెక్ట్‌కు మ్యూజికల్ గా అప్పుడే భారీ హైప్ వచ్చేసింది. బాబీ మార్క్ మాస్ ఎలివేషన్లకు, థమన్ మార్క్ ఇంటెన్స్ డ్రమ్స్ అండ్ బిజీఎమ్ తోడైతే థియేటర్లలో రచ్చ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మరియు పాటల రికార్డింగ్ పనులు ప్రారంభం కానున్నాయని ఇండస్ట్రీ టాక్.
