NTV Telugu Site icon

Nayak Rereleasing: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే కానుకగా “నాయక్” రీ రిలీజ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే కానుకగా సూపర్ డూపర్ హిట్ చిత్రం “నాయక్” రీ రిలీజ్ కానుంది. రామ్ చరణ్ సరసన అందాల భామలు కాజల్ అగర్వాల్, అమలాపాల్ నటించిన ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించగా, డి.వి.వి.దానయ్య నిర్మించిన సంగతి తెలిసిందే. దాదాపు పన్నెండేళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం అభిమానులతో పాటు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం రీ రిలీజ్ అయితే మళ్ళీ చూడాలని ప్రేక్షకాభిమానులు కోరుకుంటున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Also Read; Sharwa36: స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో శర్వానంద్ కొత్త సినిమా.. పోస్టర్ రిలీజ్..

ఈ సందర్భంగా నట్టి కుమార్ మాట్లాడుతూ, “మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డేని పురస్కరించుకుని, కాస్త ముందుగా మార్చి 23న ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నాం. ఇందులో రామ్ చరణ్ తన పాత్రకు ప్రాణప్రతిష్ట చేశారు. హీరోయిన్లు కూడా పోటీపడి నటించారు. మిగతా పాత్రధారులు కూడా తమతమ పాత్రలలో ఒదిగిపోయారు. చిత్రంలో అన్ని అంశాలు ఉన్నాయి. కామెడీకి కూడా పెద్ద పీట వేశారు. తమన్ సంగీతాన్ని అందించిన ఏ పాటకు ఆ పాట హైలైట్ గా ఉంటుంది. ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ ఓ ఆకర్షణగా నిలుస్తుంది” అని అన్నారు