NTV Telugu Site icon

Mega Star : చిరంజీవి ఐ అండ్ బ్ల‌డ్ సెంటర్ కి క‌ళ్లను దానం చేసిన ముర‌ళీ మోహ‌న్..?

Untitled Design

Untitled Design

అన్ని దానాల్లోకెల్లా అవయవ దానం అత్యున్నతమైనదనేది నేటి మాట. మానవ జన్మకు మహా అవకాశమని, నేత్ర దానం తో అంధుల్లో వెలుగులు, అవయవదానంతో ఆరిపోయే ప్రాణాలకు ఆయుష్షును, పోతూ పోతూవేరొకరిజీవితంలో వెలుగులు నింపి, సరికొత్త జీవితాన్ని ఇవ్వడం అంటే మాములు విషయం కాదు. చూపు లేని వారికి చూపును ప్ర‌సాదించేలా నేత్ర‌దానంలో కీల‌క పాత్ర పోషించ‌ట‌మే కాదు, ప్ర‌మాదాల్లో ఉన్న వ్య‌క్తుల‌కు స‌కాలంలో ర‌క్తాన్ని అందించే సేవా కార్య‌క్ర‌మాల్లో చిరంజీవి ఐ అండ్ బ్ల‌డ్ సెంటర్ ముందుంటుంది.

తెలుగు చిత్ర సీమ‌కు చెందిన సీనియ‌ర్ న‌టుడు ముర‌ళీ మోహ‌న్ మేక‌ప్ మ్యాన్ కొల్లి రాము సోద‌రి ప‌మిడి ముక్క‌ల రాజ్య‌ల‌క్ష్మి మంగ‌ళ‌వారం ఉద‌యం క‌న్నుమూశారు. ఈ విష‌యాన్ని వారు చిరంజీవి ఐ అండ్ బ్ల‌డ్ సెంటర్ కి చేర‌వేయ‌గా వెంట‌నే వారు స్పందించారు. అలా రాజ్య‌ల‌క్ష్మిగారు తాను చ‌నిపోయిన‌ప్ప‌టికీ నేత్ర‌దానం చేయ‌టం ద్వారా మ‌రో ఇద్ద‌రికీ చూపును అందించి ఎంద‌రికో ఆద‌ర్శ‌ప్రాయంగా మారారు. ఈ సంద‌ర్భంగా ముర‌ళీమోహ‌న్‌గారికి, కొల్లి రాము ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు చిరంజీవి ఐ అండ్ బ్ల‌డ్ సెంటర్ కి ధ‌న్య‌వాదాల‌ను తెలియ‌జేశారు. అలాగే ప‌మిడి ముక్క‌ల రాజ్య‌ల‌క్ష్మి శరీరాన్ని కూడా అపోలో ఆస్పత్రికి దానం చేశారు. దేహ దానంతో భావి వైద్యుల పరిశోధనలకు ఉపయోగ పడవచ్చు. ప్రమాదవశాత్తు అవయవాలు కోల్పోయినవారికి అవయవాలు దానం చేసి ఆ వ్యక్తుల జీవితానికి పునర్జన్మ ప్రసాదించేందుకు రాజ్య‌ల‌క్ష్మి కుటుంబ స‌భ్యుల‌కు ముందుకు రావడం అభినందించదగ్గ విషయమని అపోలో ఆస్పత్రి సిబ్బంది తెలిపారు.ఇలా అవయవాలు దానం చేసి ఎందరికో మేక‌ప్ మ్యాన్ కొల్లి రాము ఆదర్శప్రాయంగా నిలిచారని ఇండస్ట్రీలోని పలువురు రామును అబినందించారు.