Site icon NTV Telugu

Allu Mega Families: వివాదాల ప్రచారం అంతా ఒట్టిదే

Mega Vs Allu

Mega Vs Allu

మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య గత కొంతకాలంగా విభేదాలు ఉన్నాయని మీడియాలో గట్టి ప్రచారం జరిగింది. పలు సందర్భాలలో ఈ రెండు కుటుంబాలు కలిసి కనిపించినప్పటికీ, ఈ వార్తలు పూర్తిగా ఆగిపోలేదు. ముఖ్యంగా, ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన సీమంతం వేడుక జరిగింది. ఈ వేడుకకు అల్లు ఫ్యామిలీ హాజరు కాలేదంటూ మొదట వార్తలు వచ్చాయి. నిజానికి వారు హాజరైనా కూడా, మెగా ఫ్యామిలీ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలు, ఫోటోలలో అల్లు ఫ్యామిలీ సభ్యులు కనిపించకపోవడంతో మళ్లీ రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగిందంటూ ప్రచారం ఊపందుకుంది.

Also Read :Ayyappa Swamy Temple: ఏపీలో మరో “శబరిమల”.. గోదావరి నది తీరాన కొలువైన అయ్యప్ప..

అయితే, ఈ విభేదాల ప్రచారానికి పూర్తిస్థాయిలో బ్రేక్ వేస్తూ తాజాగా మెగా అభిమానులకి ఒక శుభవార్త వెలుగులోకి వచ్చింది. అల్లు శిరీష్ నిశ్చితార్థం వేడుకను అల్లు కుటుంబం ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ సహా మెగా ఫ్యామిలీ సభ్యులు అంతా కదలి వచ్చి సందడి చేశారు. చిరంజీవి, చరణ్ స్వయంగా అల్లు శిరీష్‌ను ఆశీర్వదించడం, కుటుంబ సభ్యులంతా కలిసి నవ్వుతూ కనిపించడం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో, ఇరు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారానికి చెక్ పడినట్లు అయ్యింది. మెగా, అల్లు కుటుంబాలు ఇప్పటికీ అన్యోన్యంగా ఉన్నాయని ఈ తాజా సంఘటన స్పష్టం చేసింది.

Exit mobile version