Site icon NTV Telugu

Meenakshi Chaudhary: బాగా కలిసొచ్చిన సంక్రాంతి సెంటిమెంట్.. మీనాక్షి ఖాతాలో హ్యాట్రిక్ పడుతుందా?

Meenakshi Chaudhary Sankranti Sentiment

Meenakshi Chaudhary Sankranti Sentiment

2026 పొంగల్ రేసులో టాలీవుడ్ హీరోయిన్స్ మధ్య టఫ్ కాంపిటీషన్ నెలకొంది. సీనియర్ నయనతార నుంచి.. యంగ్ బ్యూటీ శ్రీలీల వరకు సంక్రాంతికి వచ్చేస్తున్నారు. నయనతార, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్, డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్, మీనాక్షి చౌదరి, పూజా హెగ్డే, మమితా బైజు, శ్రీలీల, సంయుక్త మీనన్, సాక్షి వైద్యలు సంక్రాంతి రేసులో ఉన్నారు. అయితే అందరిలో సంక్రాంతి సెంటిమెంట్ మీనాక్షికి బాగా కలిసొచ్చింది.

హీరోయిన్ మీనాక్షి చౌదరికి సంక్రాంతి సెంటిమెంట్ కలిసొచ్చింది. పొంగల్‌కు వచ్చిన ప్రతిసారి మీనాక్షి హిట్ కొట్టేస్తోంది. లాస్ట్ టూ పొంగల్స్ నుంచి బ్లాక్ బస్టర్స్ నమోదు చేసింది ఈ హర్యానా బ్యూటీ. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చిన ‘గుంటూరు కారం’తో పాటు ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’తో ఇండస్ట్రీ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. నెక్ట్స్ ఇయర్ పండుగకు యువ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’లో రాణిలా మారబోతుంది. ఈ సంక్రాంతితో హ్యాట్రిక్ హిట్ కొడుతుందేమో చూడాలి.

Also Read: Team India Performance 2025: మరో సువర్ణాధ్యాయం.. ఈ ఏడాది టీమిండియా ప్రదర్శన ఇలా!

మీనాక్షి చౌదరి తన అందం, అభినయంతో టాలీవుడ్‌ను ఏలుతోంది. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా హిట్ కాకపోయినా.. మీనాక్షికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. దీంతో అడవి శేష్ ‘హిట్-2’లో ఛాన్స్ వచ్చింది. హిట్-2 హిట్ అవ్వడంతో అమ్మడి దశ తిరిగింది. వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. గుంటూరు కారం, లక్కీ భాస్కర్ , సంక్రాంతికి వస్తున్నాం లాంటి హిట్స్ పడ్డాయి. ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మీనాక్షి క్రేజ్ మరో లెవల్‌కు వెళ్ళింది. ప్రస్తుతం మీనాక్షి ఫుల్ బిజీగా ఉంది.

Exit mobile version