Site icon NTV Telugu

Meenakshi: సుశాంత్ తో పెళ్లి.. ఓపెనయిపోయిన మీనాక్షి

Meenakshi Chaudhary Sushant

Meenakshi Chaudhary Sushant

గత కొద్దిరోజులుగా హీరోయిన్ మీనాక్షి చౌదరి అక్కినేని కుటుంబానికి చెందిన సుశాంత్ తో ప్రేమలో ఉందని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం మొదలైంది. నిజానికి వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో నటించారు. ఆ సినిమా మీనాక్షి చౌదరికి మొదటి తెలుగు సినిమా సుశాంత్ హీరోగా తెరకెక్కిన ఇచ్చట వాహనములు నిలపరాదు అనే సినిమా ద్వారానే మీనాక్షి చౌదరి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ వచ్చిన ఆమె ఈ మధ్యనే లక్కీ భాస్కర్ అనే సినిమాతో ఒక హిట్ అందుకుంది. ఆ తర్వాత మట్కా అనే సినిమాతో ఒక ఫ్లాప్ మూటగట్టుకుంది. అయితే ఎందుకు మొదలైందో ఎలా మొదలైందో తెలియదు గానీ మీనాక్షి చౌదరి సుశాంత్ తో ఏడడుగులు వేయబోతోంది అనే ప్రచారం మొదలైంది.

Director Death: సినీ పరిశ్రమలో విషాదం.. దర్శకుడు మృతి!

ఇప్పటివరకు సుశాంత్ నుంచి కానీ మీనాక్షి నుంచి కానీ ఈ విషయం మీద క్లారిటీ రాలేదు. కానీ తాజాగా ఈ విషయం మీద ఆమె స్పందించినట్లుగా తెలుస్తోంది. నేను సింగల్ గా ఉన్నాను, త్వరలో పెళ్లి చేసుకునే ఆలోచన కూడా లేదు. ప్రతి నెలలో నాకు కొత్త రిలేషన్ షిప్ లేదా కొత్త సినిమా గురించి రూమర్స్ పుట్టించడం సర్వసాధారణం అయిపోయింది అంటూ ఆమె కామెంట్ చేసింది. ఇక ఒక వెబ్ సిరీస్ ద్వారా నటన రంగానికి పరిచయమైన ఆమె తెలుగు సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన వెంటనే వరుస అవకాశాలు దక్కాయి. ముఖ్యంగా సితార కాంపౌండ్ లో గుంటూరు సినిమాతో పాటు లక్కీ భాస్కర్ సినిమా కూడా దక్కించుకుని, ఆమె వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఇక పెళ్లి గురించి ఆమె క్లారిటీ ఇవ్వడంతో ఈ విషయం మీద పుకార్లకు చెక్ పెట్టినట్లు అయింది.

Exit mobile version