NTV Telugu Site icon

Meena: మొదటిసారి ఆమెను చూస్తుంటే ఈర్ష్యగా ఉంది.. భరించలేకపోతున్నా

Meena

Meena

Meena: టాలీవుడ్ సీనియర్ నటి మీనా గురించి ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ సీనియర్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఈ భామ రీ ఎంట్రీలో కూడా అదరగొడుతోంది. ఇక ఇటీవలే భర్త విద్యాసాగర్ ను పోగొట్టుకున్న ఆమె ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి బయటపడుతోంది. ప్రస్తుతం వరుస అవకాశాలను అందుకొని బిజీగా మారిన మీనా ఒక హీరోయిన్ ను చూసి అసూయ పడుతున్నాను అని చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మీనా అంతగా అసూయ పడిన ఆ హీరోయిన్ ఎవరో కాదు అందాల సుందరి ఐశ్వర్యారాయ్ బచ్చన్. పొన్నియిన్ సెల్వన్ లో ఆమె అందానికి, ఆమె పాత్రకు ముగ్దురాలిని అయిపోయినట్లు చెప్పుకొచ్చింది. “సరే, నేను ఇంకా దాచి ఉంచలేకపోతున్నాను. ఇది నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

ఐశ్వర్య రాయ్ బచ్చన్ ను చూస్తుంటే నాకు చాలా ఈర్ష్యగా ఉంది. నా జీవితంలో మొదటి సారి నేను ఒకరి పట్ల అసూయపడుతున్నాను. ఎందుకంటే ఆమె PS1 లో నా డ్రీమ్ క్యారెక్టర్ నందిని పాత్రను పోషించింది. ఏదిఏమైనా ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించాలని కోరుకుంటూ.. నటించిన నటీనటులందరికి అల్ ది బెస్ట్”అని చెప్పుకొచ్చింది. దీంతో ఒక్కసారిగా కోలీవుడ్ ఉలిక్కిపడింది. అంటే ఐశ్వర్య రాయ్ కన్నా ముందు మీనాను ఈ పాత్ర కోసం సంప్రదించారా..? మరి ఎందుకు మీనా ఈ పాత్ర నుంచి వైదొలిగింది అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మరికొందరు ఐశ్వర్య ప్లేస్ లో మీరు చేసినా బాగానే ఉండేది అని చెప్పుకొస్తున్నారు. మరి మణిరత్నం సినిమాలో మీనా ఎప్పుడు నటిస్తుందో చూడాలి.

Show comments