సినిమా హిట్ అవ్వాలంటే వందల కోట్ల బడ్జెట్, భారీ సెట్టింగులే అక్కర్లేదు.. మైండ్ బ్లాక్ చేసే కంటెంట్, కొత్త తరహా మేకింగ్ ఉంటే చాలు! ఇదే విషయాన్ని మరోసారి బలంగా నిరూపించింది చిన్న చిత్రం ‘మయూఖ’. ఎలాంటి హడావుడి లేకుండా థియేటర్లలోకి వచ్చి మంచి టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా, ఏకంగా న్యూయార్క్, కేన్స్ వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేదికలపై అవార్డులు కొల్లగొట్టి అందరి దృష్టినీ ఆకర్షించింది. పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో, శ్రీ తేజ్ SK దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను భయపెట్టడానికి, థ్రిల్ చేయడానికి వచ్చేసింది. సాధారణంగా ఓటీటీలో సినిమా చూసేటప్పుడు మధ్యలో ఆపుతూ, తీరిగ్గా చూస్తుంటాం. కానీ ‘మయూఖ’ విషయంలో మాత్రం అలా అస్సలు చేయొద్దని దర్శకుడు శ్రీ తేజ్ SK ప్రేక్షకులకు ఓ స్పెషల్ కండిషన్ పెడుతున్నారు. ఈ సినిమాను మధ్యలో బ్రేక్ ఇవ్వకుండా **ఒకే సిట్టింగ్‌లో** పూర్తిగా చూస్తేనే ఆ అసలైన కిక్, సైకలాజికల్ థ్రిల్ అర్థమవుతుందని ఆయన చెబుతున్నారు.
దీనికి బలమైన కారణమే ఉంది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా మలయాళ సినిమాల తరహాలో చాలా నెమ్మదిగా (స్లో బర్న్) సాగుతూ ప్రేక్షకులను కథలోకి లాగుతుంది. ఎప్పుడైతే ప్రీ-ఇంటర్వెల్ దగ్గరకు వస్తుందో.. అక్కడి నుంచి అసలైన ఆట మొదలవుతుంది! ఊహించని మలుపులు, ఉత్కంఠభరితమైన కథనంతో సెకండాఫ్ మొత్తం సీటు అంచున కూర్చోబెట్టేలా సాగుతుందట. అందుకే మధ్యలో ఆపితే ఆ ఫ్లో మిస్ అవుతారన్నది మేకర్స్ మాట. చిన్న బడ్జెట్ సినిమా అయినా సరే, టెక్నికల్‌గా ‘మయూఖ’ ఎక్కడా తగ్గలేదు. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఇందులో ప్రత్యేకమైన ‘మోనోక్రోమాటిక్ లైటింగ్’ ప్యాటర్న్‌ను వాడటం విశేషం. స్పానిష్, కొరియన్, హాలీవుడ్ థ్రిల్లర్స్ నుంచి స్ఫూర్తి పొంది, మన ప్రేక్షకులకు ఒక సరికొత్త విజువల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా ఈ సినిమాను తీర్చిదిద్దారు. శశిధర్ నల్ల, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఎంతో ప్యాషన్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ అవార్డ్ విన్నింగ్ థ్రిల్లర్ ఇప్పటికే డిజిటల్ వేదికపైకి వచ్చేసింది. నవంబర్ 20 అర్ధరాత్రి నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు వెర్షన్ ప్రత్యేకంగా స్ట్రీమింగ్ అవుతోంది. నవంబర్ 23 నుంచి తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు జియో హాట్‌స్టార్.. రెండు ప్లాట్‌ఫామ్స్‌లోనూ అందుబాటులోకి రానుంది.

