Mayasabha: వైఎస్-చంద్రబాబు స్నేహంపై సిరీస్.. టీజర్ రిలీజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోనీ లివ్ తాజాగా మరో డిఫరెంట్ వెబ్ సిరీస్‌తో అలరించటానికి సిద్ధమవుతోంది. అదే ‘మయసభ’. ‘రైజ్ ఆఫ్ ది టైటాన్స్’ ట్యాగ్ లైన్. వెర్సటైల్ ఫిల్మ్ మేకర్ దేవా కట్టా, కిరణ్ జయ కుమార్ దర్శకత్వంలో హిట్ మ్యాన్ అండ్ ప్రూడోస్ ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి బ్యానర్స్‌పై విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీహర్ష రూపొందించారు. వైఎస్-చంద్రబాబు స్నేహంపై సిరీస్ ఉండనుంది కానీ పేర్లు మాత్రం పూర్తిగా మార్చేశారు.
ఇద్దరు గొప్ప స్నేహితులు.. అయితే వారి రాజకీయ ప్రస్థానాలు వారి మధ్య తెలియని దూరాన్ని పెంచాయి. మానసికంగా ఎంత దగ్గరి వారైనా రాజకీయ చదరంగంలో ఒకరిపై ఒకరు ఎత్తులు వేసుకోక తప్పలేదు. అలాంటి ఇద్దరు స్నేహితుల కథే ‘మయసభ’. ఇందులో కాకర్ల కృష్ణమ నాయుడు పాత్రలో ఆది పినిశెట్టి, ఎం.ఎస్.రామిరెడ్డి పాత్రలో చైతన్య రావు, ఐరావతి బసు పాత్రలో దివ్య దత్తా నటించారు.
Also Read
- Fauzi premieres : వరల్డ్ వైడ్‌గా ఒకరోజు ముందుగానే 'ఫౌజీ' ప్రీమియర్స్.. కన్ఫామ్ చేసిన మైత్రి రవి
- Suriya-Jyothika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ జంటగా వస్తారా?.. వైరల్ అవుతున్న సూర్య, జ్యోతిక ఫోటోషూట్!
- Pooja Hegde : 18 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ఇలా ఉందేంటి
- Ajith Kumar: 'డేర్‌డెవిల్'గా దూసుకొస్తున్న అజిత్.. మళ్లీ అధిక్ రవిచంద్రన్‌తో చేతులు కలిపిన స్టార్ హీరో!
జీవితంలో ఏదో సాధించాలి, ప్రజలకు అండగా నిలబడాలనే లక్ష్యంతో రాజకీయాల్లో అడుగు పెట్టిన ఇద్దరు స్నేహితుల దారులు ఎలా మారాయి? చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వారే.. రాజకీయ గమనంలో ప్రత్యర్థులుగా ఎలా మారారు. ఇద్దరి గొప్ప స్నేహితుల మధ్య ఉండే స్నేహం, మానసిక సంఘర్షణ.. పొలిటికల్ జర్నీలో వారు ఎదుర్కొన పరిస్థితులను భావోద్వేగంగా ఆవిష్కరించిన వెబ్ సిరీస్ ‘మయసభ’. ఈ సిరీస్ సోనీ లివ్‌లో ఆగస్ట్ 7 నుంచి తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈసందర్భంగా శనివారం రోజున సోనీ లివ్ ‘మయసభ’ ట్రైలర్‌ను విడుదల చేశారు. .
ప్రతి సన్నివేశంలో ఓ ఎమోషన్, ఫ్రెండ్ షిప్, ఎత్తుకు పై ఎత్తులు వేసే రాజకీయ చదరంగం.. ఎదుర్కొన్న ఆటు పోట్లు అన్నింటినీ దేవా కట్టా టీజర్లో అద్భుతంగా ఆవిష్కరించారు.
Also Read:Mohanbabu : వాళ్లు క్షేమంగా ఉండాలి.. ట్రోలర్స్ పై మోహన్ బాబు..
ఇక డైలాగులైతే
* ఫ్రెండ్ గా ఒక మాట చెప్పనా నాయుడు… యుద్ధం నీ ధర్మం
* వ్యవసాయాన్ని మించిన చదువు లేదు పెద్దయ్య…మా అందరికన్నా పెద్ద చదువు నీదే.
* డబ్బులతో కొనలేనిది ఒకటే ఒకటి ఉంది… ప్రజల మనసు.
* మడక దున్నే కులంలో పుట్టిన వాడికి నీకెందుకు అబ్బే రాజకీయం.
* వసూలు చేసే కులం లో పుట్టిన రౌడీ వి నీకెందుకయ్యా వైద్యం.
* ప్రతిపక్ష నాయకుడికి ఎందుకు ఫోన్ చేసినావ్? ఫ్రెండ్ గానా.. ప్రత్యర్థి గానా?
* ఏం జరుగుతుంది నాయుడు?.. కురుక్షేత్రం.
* ఇది చావో రేవో అర్ధం కావడం లేదు రెడ్డి… 20 ఏళ్ల రాజకీయ జీవితం ఒక మేకప్ ఆర్టిస్ట్ చెప్పు కింద నలిగిపోతుంది అనుకోలేదు.
* స్నేహితుడి గా ఒక మాట చెప్పు. ఈ ఉచ్చు నుంచి బయటపడతానంటావా?
* ఈరోజు నువ్వు గెలిస్తే…ఆ గెలుపు నా చేతిలో వెన్నుపోటు అనే బాణంగా మారుతుంది.. ఆ బాణం నిన్ను ఓడించేంత వరకు వాడుతూనే ఉంటాను.
* చివరికి పిల్లనిచ్చిన మామ తోనే ఉనికి కోసం పోరాడుతున్నాను. I must go all the way.. వేరే దారి లేదు.
“మయసభ” టీజర్ లోని డైలాగులు తుటాల్లాగా కనెక్ట్ అవుతున్నాయి. గొప్ప స్నేహితుల కథగా ప్రారంభమై తరువాత రాజకీయ ప్రత్యర్థులుగా మారిన ఇద్దరి వ్యక్తుల పయనం.
తాజావార్తలు
-
Fauzi premieres : వరల్డ్ వైడ్‌గా ఒకరోజు ముందుగానే ‘ఫౌజీ’ ప్రీమియర్స్.. కన్ఫామ్ చేసిన మైత్రి రవి
-
Suriya-Jyothika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ జంటగా వస్తారా?.. వైరల్ అవుతున్న సూర్య, జ్యోతిక ఫోటోషూట్!
-
Arshdeep Singh-Samreen Kaur: హార్ట్, లాక్ ఎమోజీలే చెప్పేస్తున్నాయా..? అర్ష్‌దీప్-సమ్రీన్ రిలేషన్‌పై మళ్లీ చర్చ..!
-
Liquor Scam Case: లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం.. ఎయిర్‌పోర్టులో ప్రధాన నిందితుడు అరెస్ట్..
-
Pooja Hegde : 18 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ఇలా ఉందేంటి
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్‌తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!