Matru : కన్నీళ్లు తెప్పిస్తున్న ‘మాతృ’ ‘అపరంజి బొమ్మ.. మా అమ్మ’ పాట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగులోనే కాదు దాదాపుగా అన్ని భాషల్లో మదర్ సెంటిమెంట్‌తో వచ్చిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మాతృ దేవో భవ నుంచి బిచ్చగాడు వరకు ఎన్నెన్నో కల్ట్ క్లాసిక్‌గా నిలిచాయి. ఇప్పుడు ఇదే మదర్ సెంటిమెంట్‌తో ఓ సినిమా రాబోతోంది. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్ మీద శ్రీ పద్మ సమర్పణలో బి. శివ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘మాతృ’. శ్రీరామ్, నందినీ రాయ్, సుగి విజయ్, రూపాలి భూషణ్ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జాన్ జక్కీ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తి అయింది.
త్వరలోనే విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సిద్దమైంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ పెంచేశారు. మాతృ టైటిల్‌కు తగ్గట్టుగా సాగే ఓ మదర్ సెంటిమెంట్ తో ఎమోషనల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. అపరంజి బొమ్మ.. మా అమ్మ అంటూ సాగే ఈ పాటను దినేశ్ రుద్ర ఆలపించగా.. బి. శివ ప్రసాద్ సాహిత్యాన్ని అందించారు. శేఖర్ చంద్ర బాణీ హృదయాన్ని హత్తుకునేలా ఉంది. ఈ పాట అందరి హృదయాల్ని కరిగించేలా ఉంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఇక ఈ సినిమా నిర్మాతే ఇంతటి గొప్ప పాటను రాయడం విశేషం. ఈ చిత్రానికి రాహుల్ శ్రీ వాత్సవ్ కెమెరామెన్‌గా, సత్యనారాయణ బల్లా ఎడిటర్‌గా పని చేశారు. త్వరలోనే ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు.
Also Read
- Tags
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!