NTV Telugu Site icon

Mass Maharaj: మాస్ రాజా రవితేజ, శ్రీలీల సినిమా టైటిల్ ఇదే..

Untitled Design 2024 08 12t113948.252

Untitled Design 2024 08 12t113948.252

మాస్ మ‌హారాజా ర‌వితేజ నటించిన మిస్టర్ బచ్చన్ రిలీజ్ కు రెడీ గా వుంది. ఈ లోగా తరువాత సినిమాను ట్రాక్ ఎక్కించే పనిలో బిజీ గా వున్నాడు రవితేజ. ఓ సినిమా పూర్త‌వ‌గానే ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా మ‌రో సినిమాను సెట్స్ పైకి తీసుకెళుతున్నాడు మాస్ రాజ. ప్ర‌స్తుతం ర‌వితేజ నటిస్తున్న 75వ సినిమా సెట్స్‌పై ఉంది. భాను బోగ‌వ‌రపు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యాన‌ర్స్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ, సాయి సౌజ‌న్య నిర్మిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్‌గా న‌టిస్తోంది.

Also Read: Tollywood: హమ్మయ్య.. ఆ సినిమాకు ఇక టెన్షన్ తీరిపోయినట్టే..

ఈ సినిమాకు సంభందించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.సితార యూనిట్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం రవితేజ, శ్రీలీల సినిమాకు “కోహినూర్” అనే టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. తెలంగాణ నేప‌థ్యంలో ఈ సినిమా తెర‌కెక్కనున్నట్టు సమాచారం. ల‌క్ష్మ‌ణ్ భేరి అనే పాత్ర‌లో మాస్ మ‌హారాజా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. రవితేజకు తగ్గట్టు మాస్ ఎలిమెంట్స్‌తో పాటు కామెడీ ట‌చ్ ఉండేలా మాస్ రాజా పాత్ర‌ను డిజైన్ చేసాడట దర్శకుడు భాను. వ‌చ్చే ఏడాది సమ్మర్ బ‌రిలో సినిమాను దింపాల‌నేది మేక‌ర్స్ ఆలోచ‌న‌గా క‌నిపిస్తోంది. అందుకోసమే కోహినూర్ చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా చేస్తున్నారు మేకర్స్.

Also Read: Tollywood: ఆగస్టు సెకండ్ వీక్ రిలీజ్ సినిమాల ఫస్ట్ వీకెండ్ రిపోర్ట్..

మ‌రో వైపు ఆగ‌స్ట్ 15న ర‌వితేజ ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో సంద‌డి చేయ‌టానికి రెడీ అవుతున్నారు. దీనికి హారీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. హిందీ మూవీ రైడ్‌కు ఇది రీమేక్‌. భాగ్య‌శ్రీ బోర్సె క‌థానాయిక‌. ఇందులో ర‌వితేజ ఇన్‌క‌మ్ ట్యాక్స్ ఆఫీస‌ర్ పాత్ర‌లో అల‌రించ‌బోతున్నారు. జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌లో న‌టించ‌గా పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్ దీన్ని నిర్మిస్తున్నారు.

Show comments