Site icon NTV Telugu

Mani Ratnam Next Movie: మణిరత్నం లవ్ స్టోరీలో విజయ్ సేతుపతి-రుక్మిణి?

Mani Ratnam

Mani Ratnam

Mani Ratnam Next Movie: మణిరత్నం తన కొత్త సినిమాకి రెడీ అవుతున్నారు అనే ప్రచారం జోరుగా కొనసాగుతుంది. రీసెంట్‌గా కమలహాసన్, శింబు, త్రిష మల్టీస్టార్స్‌ ప్రధాన పాత్రల్లో నటించిన థగ్‌లైఫ్‌ మూవీని తెరకెక్కించిన మణిరత్నం అనుకున్నంత స్థాయిలో విజయం దక్కలేదు. దీంతో చిన్న గ్యాప్‌ తీసుకున్న ఆయన తాజాగా ఒక లవ్ స్టోరీని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతుంది. అంతేకాదు ఇందులో నటుడు దృవ్‌ విక్రమ్‌ హీరోగా నటించనున్నట్లు ప్రచారం ఒకవైపు, శింబుతో సినిమా తీయబోతున్నడని మరోవైపు వార్తలు వచ్చాయి. ఆయనకు కథను కూడా వినిపించినట్లు ప్రచారం జరుగుతుంది. కాగా, శింబు ప్రస్తుతం వెట్రిమారన్‌ డైరెక్షన్ లో నటిస్తున్న అరసన్‌ మూవీలో నటిస్తూ బిజీగా ఉండడంతో ఆయనకు బదులుగా యాక్టర్ విజయ్‌ సేతుపతిని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. అయితే, మణిరత్నం దర్శకత్వంలో విజయ్‌ సేతుపతి ఇంతకు ముందు నవాబ్‌‌ అనే సినిమాలో కీ రోల్ పోషించారు. తాజాగా సెకండ్ టైం మణిరత్నం, విజయ్ కాంబో రిపీట్‌ కాబోతుందని సమాచారం.

Read Also: IND vs AUS: నేడు ఆస్ట్రేలియా- భారత్ మధ్య ఐదో టీ20.. సిరీస్ గెలిచేనా..?

ఇక, ప్రస్తుతం పుల్‌ ఫామ్‌లో ఉన్న నటి రుక్మిణి వసంత్‌ను కథానాయకిగా ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు టాక్. అయితే, రుక్మిణి కోలీవుడ్‌కు పరిచయమైంది విజయ్‌ సేతుపతి హీరోగా నటించిన ఏస్‌ అనే సినిమా ద్వారానే కావడం గమనార్హం. దీంతో ఈ క్రేజీ కాంబో మరోసారి రిపీట్‌ కాబోతుంది. ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే ఛాన్స్ ఉంది. ఇక, విజయ్‌ సేతుపతి ప్రస్తుతం బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షోకు హోస్ట్ గా వ్యవహరించడంతో పాటు తెలుగులో పూరి జగన్నాథ్‌ డైరెక్షన్ లో నటిస్తున్నారు.

Exit mobile version