Inji Vellam: చడీచప్పుడు లేకుండా షూటింగ్ ముగించేసిన మణిరత్నం! రిలీజ్ ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Inji Vellam: స్టార్ డైరెక్టర్ మణిరత్నం సినిమా అంటేనే మూవీ లవర్స్‌కు ఏదో తెలియని ఆసక్తి. అలాంటి దర్శకుడు ఇద్దరు బ్రిలియంట్ యాక్టర్స్ విజయ్ సేతుపతి, సాయి పల్లవిలను పెట్టి సినిమా చేస్తున్నారనే వార్తే ఒక పెద్ద క్రేజ్ అయితే.. ఎలాంటి హడావుడి లేకుండా, చాలా సైలెంట్‌గా ఆ సినిమా షూటింగ్ మొత్తం చకచకా ముగించేయడం ఇప్పుడు సినీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ‘ఇంజి వెల్లమ్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
సాధారణంగా పెద్ద డైరెక్టర్ల సినిమాలు సెట్స్‌పైకి వెళ్లాయంటే షూటింగ్ పూర్తి కావడానికే ఏళ్ల తరబడి సమయం పడుతుంటుంది. కానీ మణిరత్నం తనదైన ప్లానింగ్‌తో ఎలాంటి హడావిడి లేకుండానే ఈ సినిమా షూటింగ్‌ని చకచకా పూర్తి చేసేశారట. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చాలా వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోందని తెలుస్తుంది. ఇక అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న రిలీజ్ విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మొదట్లోనే, సరిగ్గా 2027 జనవరి 29న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. సంక్రాంతి సందడి ముగిసిన వెంటనే ఈ సినిమాను థియేటర్లలోకి దించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
Also Read
ఎలాంటి పాత్ర ఇచ్చినా పరకాయ ప్రవేశం చేసే విజయ్ సేతుపతి, తన నేచురల్ యాక్టింగ్‌తో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న సాయి పల్లవి తొలిసారి వెండితెరపై కలిసి నటిస్తున్నారు. పైగా వీరిద్దరినీ తన మార్క్ ఫ్రేమ్‌లో చూపిస్తోంది మణిరత్నం కావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మణిరత్నం మార్క్ ఫీల్ గుడ్ డ్రామాలో ఈ ఇద్దరు టాలెంటెడ్ నటులను ఎలా ప్రెసెంట్ చేశారో చూడాలని ఆడియన్స్ చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Inji Vellam: చడీచప్పుడు లేకుండా షూటింగ్ ముగించేసిన మణిరత్నం! రిలీజ్ ఎప్పుడంటే?
-
Union Cabinet Decisions : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రూ.29,267 కోట్ల కేటాయింపు
-
Congress: నాలుగు రాష్ట్రాల్లో 28 ఎమ్మెల్సీ ఎన్నికలు.. కాంగ్రెస్‌కు ‘‘జీరో’’
-
Arnab Cyclone: అధికారులకు పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు.. తుఫాన్ తగ్గే వరకు క్షేత్రస్థాయిలోనే ఉండాలి..
-
DA Hike : కేంద్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ 3 శాతం పెంపు
ట్రెండింగ్
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!