Mangalavaram 2: ఈసారి మరింత భయపెట్టేలా మంగళవారం 2
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్ఎక్స్ 100 సినిమాతో సూపర్ హిట్ అందుకుని టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ ఎంట్రీ ఇచ్చిన అజయ్ భూపతికి ఆ తర్వాత చేసిన మహాసముద్రం అనే సినిమా పెద్దగా కలిసి రాలేదు. అయితే ఏ మాత్రం నిరాశ చెందకుండా, పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో చేసిన మంగళవారం సినిమా ఆయనకు మరో హిట్ అందించింది. అయితే ఇప్పుడు ఆయన మంగళవారం సినిమాకి సీక్వెల్‌గా మంగళవారం 2 సినిమా రూపొందించే పనిలో ఉన్నాడు. ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త తెరపైకి వచ్చింది. అదేంటంటే, మంగళవారం సినిమాలో ఒక మహిళ మానసిక రుగ్మత ఆధారంగా సినిమా కథ రాసుకున్నాడు, దానికి కాస్త హారర్ టచ్ ఇచ్చాడు.
Read More: Trivikram Srinivas : సిరివెన్నెల రాసిన ఆ పాటనే అన్నింటికంటే గొప్పది : త్రివిక్రమ్
Also Read
- IRUMUDI OTT : ప్లాప్స్ ఉన్నాకూడా రవితేజ 'ఇరుముడి' ఓటీటీ రైట్స్ భారీ ధర పలికాయి
- Vijay Sethupathi : నాడు పూరి సినిమాకు జూనియర్ ఆర్టిస్ట్.. నేడు అదే పూరి దర్శకత్వంలో హీరోగా!
- Peddi :బుచ్చిబాబుపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్!
- Anantha Sriram: "విషం కక్కే రివ్యూల దారిద్యాన్ని దాటి 'పెద్ది' బాక్సాఫీస్ బద్దలుకొట్టింది!
కానీ ఈ సెకండ్ పార్ట్ విషయంలో మాత్రం రూరల్ డివోషనల్ టచ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. నిజానికి మనం పల్లెటూర్లకు వెళితే, గ్రామదేవతలు, ఊరి దేవతల ప్రస్తావన వింటూనే ఉంటాం. అలాంటి ఒక గ్రామ దేవత కథ ఆధారంగా ఈ సినిమా కథ రాసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు కథ రాయడం పూర్తయిందని, ఒక స్టార్ హీరోయిన్‌ని అప్ప్రోచ్ అయ్యారని, ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉందని అంటున్నారు. ఈ సినిమాని అజయ్ భూపతితో కలిసి ఒక బడా నిర్మాణ సంస్థ నిర్మించబోతోంది. ఒకసారి హీరోయిన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చాక, అధికారికంగా అనౌన్స్ చేసి సినిమాని పట్టాలెక్కించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
BCCI Selection Controversy: హర్షిత్ రాణాను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు.. బీసీసీఐ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందా?
-
Magudam : డైరెక్టర్ గా విశాల్… 30 ఏళ్ల తరువాత తీరనున్న కల
-
Trump-Netanyahu: యుద్ధం ముగించాలని ట్రంప్.. మరింత తీవ్రం చేయాలని నెతన్యాహు? అసలు కారణం ఇదే!
-
WTC India: ఆఫ్గనిస్తాన్ పై టీమిండియా భారీ విజయం.. కానీ ఎం లాభం లేదు.! ఎందుకంటే..?
-
H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్.. ట్రంప్ విధించిన భారీ రుసుము చెల్లదన్న న్యాయస్థానం!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!